ఉపాధి హామీలను ప్రజలు సద్వినియోగించుకోవాలి..
– గ్రామా పంచాయితీలను సందర్శించిన పంచాయితీ రాజ్ కమిషనర్..
– ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
– రాష్ట్ర పంచాయితీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ జాయింట్ కమిషనర్ శ్రీనాథ్
కాకతీయ,ఆత్మకూరు : ఉపాధి హామీ పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రాష్ట్ర పంచాయితీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ జాయింట్ కమిషనర్ శ్రీనాథ్ అన్నారు.మంగళవారం ఆత్మకూరు మండలం కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి అధికారుల పని తీరును పరిశీలించారు అనంతరం మండలంలోని పెంచికలపేట, అగ్రంపహాడ్ గ్రామపంచాయతీలను సందర్శించి ఎగితే రాజయ్య పొలంలో 18 వేల రూపాయలతో విబిజిరంజీ నిధులతో నిర్మిస్తున్న ఫాంపాండు పనులను సందర్శించి కూలీలతో మాట్లాడారు ఉపాధి హామీ పనుల్లో అధికారులు నిర్లక్యం వహిస్తే సహించేది లేదని తెలిపారు.అనంతరం తిరుమలగిరి గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక డాటా నమోదు కార్యక్రమాన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తనిఖీ చేయడం జరిగింది.అందరు రైతులు వి బి జి రాంజీ ద్వారా చేపడుతున్న ఇట్టి పాంపాండ్ పనులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో డిపిఓ రమాకాంత్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, డిఎల్పిఓ రవిబాబు, ఎంపీఓ యోగిత, ఏపీవో రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి బుచ్చిరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ పాష తదితరులు పాల్గొన్నారు.

