epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దొంతి దిష్టిబొమ్మతో శవయాత్ర

దొంతి దిష్టిబొమ్మతో శవయాత్ర
పెద్ది విగ్రహ నిర్మాణం కూల్చివేతపై బీఆర్‌ఎస్‌ భగ్గు
కాంగ్రెస్‌ తీరుపై ఆకుల శ్రీనివాస్‌ మండిపాటు
నియోజకవర్గవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు

కాకతీయ, నర్సంపేట టౌన్‌: దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన నిర్మాణాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. మంగళవారం తొగర్రాయిలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి అనంతరం దహనం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్‌ జిల్లా మాజీ జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం కోసం చేపట్టిన నిర్మాణాన్ని కూల్చివేయడం కాంగ్రెస్‌ ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు. ప్రజాసేవ చేసిన దివంగత నేతను అవమానించేలా వ్యవహరించడం సరికాదన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన పెద్ది జ్ఞాపకాలను నిర్మాణాలు కూల్చడం ద్వారా చెరిపేయలేరని స్పష్టం చేశారు.

అభిమానాన్ని కూల్చలేరు
‘‘నిర్మాణాన్ని కూల్చగలరేమో.. పెద్ది సుదర్శన్‌రెడ్డిపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని మాత్రం కూల్చలేరు’’ అని శ్రీనివాస్‌ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడటం తగదన్నారు. విగ్రహ నిర్మాణం కూల్చివేతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు నిరసనగా నర్సంపేట నియోజకవర్గవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి చేసిన ప్రజాసేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు తుమ్మలపల్లి మహేందర్‌, బొల్లం అనిల్‌, పొగాకు ప్రేమ్‌కుమార్‌, బుక్క సునీల్‌, హనుమకొండ అనిల్‌, అన్న లక్ష్మణ్‌, రాసరాజు, గొర్రె రాంబాబు, పెంతల మహేష్‌, పెంతల గణేష్‌, అమ్మిరెడ్డి రాజు, జట్టబోయిన రాజు, తుమ్మలపల్లి శ్రీనివాస్‌, కస్తూరి రాజు, హనుమకొండ బాబు, చిలువేరు సుమన్‌, హనుమకొండ ప్రభాకర్‌, హర్షం చిరంజీవి, చిలువేరు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.