వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో నలుగురు సీఐలకు బదిలీలు
ఫణీధర్‌కు నెక్కొండ సర్కిల్ బాధ్యతలు
శంకర్‌రావుకు నర్సంపేట రూరల్–దుగ్గొండి పోస్టింగ్
శ్రీనివాస్, సాయి రమణకు వీఆర్‌కు బదిలీ
తక్షణమే ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశాలు
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీఆర్‌లో ఉన్న కె. ఫణీధర్‌ను నెక్కొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. నెక్కొండలో పనిచేస్తున్న ఎస్. శ్రీనివాస్‌ను వీఆర్‌కు బదిలీ చేశారు. అదేవిధంగా వీఆర్‌లో ఉన్న జె. శంకర్‌రావును నర్సంపేట రూరల్/దుగ్గొండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. అక్కడ పనిచేస్తున్న ఎం. సాయి రమణను వీఆర్‌కు బదిలీ చేశారు. నర్సంపేట డివిజన్‌లో బందోబస్తు విధులు పూర్తయిన అనంతరం సీఐలు సాయి రమణ, శ్రీనివాస్‌లను రిలీవ్ చేయాలని ఏసీపీ నర్సంపేటను ఆదేశించారు. ఫణీధర్, శంకర్‌రావులను వెంటనే రిలీవ్ చేసి కొత్త పోస్టింగ్‌లలో విధుల్లో చేరి రిపోర్టు చేయాలని ఏసీపీ, సీఎస్‌బీని సూచించారు.

