epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మాజీ ఎమ్మెల్యేలు తప్పుడు ఆరోపణలు మానుకోవాలి

మాజీ ఎమ్మెల్యేలు తప్పుడు ఆరోపణలు మానుకోవాలి
ప్రజల విశ్వాసం కోల్పోయిన నేతలు వాస్తవాలు అంగీకరించాలి
గత ప్రభుత్వంలో వదిలేసిన పనులను పూర్తి చేసి ప్రారంభిస్తున్నాం
పరకాల అభివృద్ధికి రూ.484 కోట్లకు పైగా నిధులు
బీఆర్‌ఎస్‌ సెంటిమెంట్‌ రాజకీయాలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరు
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు

కాకతీయ, హనుమకొండ : ప్రజల విశ్వాసం కోల్పోయిన మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయ్‌ భాస్కర్‌ తప్పుడు ఆరోపణలు చేయడం మానుకుని వాస్తవాలను అంగీకరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అన్నారు. బుధవారం హనుమకొండలోని డీసీసీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ నేతలు సెంటిమెంట్‌ రాజకీయాలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరన్నారు. పరకాల 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి దాదాపు రూ.35 కోట్ల వ్యయం కాగా, గత ప్రభుత్వం కేవలం రూ.6.19 కోట్లు విడుదల చేయడంతో పనులు 16 నెలలు నిలిచిపోయాయని రేవూరి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చొరవ, సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో మిగిలిన నిధులు విడుదల చేయించి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. గత ప్రభుత్వం శంకుస్థాపన చేసి వదిలేసిన పనులను పూర్తి చేయడం నేరమా అని ప్రశ్నించారు.

రూ.484 కోట్లకు పైగా అభివృద్ధి పనులు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరకాల నియోజకవర్గంలో రూ.484 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించి అమలు చేస్తున్నామని తెలిపారు. పరకాల పట్టణానికి శాశ్వత మంచినీటి సౌకర్యం కోసం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించామని, రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళా డెయిరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. పరకాల నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వమే శంకుస్థాపన చేసి ప్రారంభించిందన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ను అధికారంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులు ఇప్పుడు ఆయన పేరు ప్రస్తావించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆయన స్వగ్రామం అక్కంపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం దాదాపు రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు రాజకీయ సెంటిమెంట్‌తో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు తామే చేస్తామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.