ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు
కాకతీయ, నెల్లికుదురు: చరిత్రను సజీవంగా నిలిపి భావితరాలకు అందించేదే ఫోటోగ్రఫీ అని ఫోటోగ్రఫీ,
వీడియోగ్రాఫర్ అసోసియేషన్ మండల అధ్యక్షులు కడారి వెంకటరమణ అన్నారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాకస్ మండే డాగ్యూర్ జ్ఞాపకార్ధంగా187 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని
మండలకేంద్రంలోఘనంగానిర్వహించి,జెండాఆవిష్కరించారు.తదుపరి మాజీ పిఎస్డి లకు
శాలువాకప్పిసత్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఎటువంటి సన్నివేశానైన ఉన్నది ఉన్నట్లుగా భావోద్వేగాలను సజీవంగా చూపించేదే ఫోటోగ్రఫీ అని అన్నారు.నేటి ప్రస్తుత పరిస్థితులలో పెరిగిపోతున్న సాంకేతిక పరిజ్ఞానాన్నిసామాజిక మాధ్యమాల సహాయంతో ఫోటోగ్రాఫర్లకు పని తగ్గిందని, ఫోటో వీడియో గ్రాఫర్ అందరూ ఒకరికొకరు సహకారం అందించుకుంటూ సమాజంలో అభివృద్ధిలో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నరసింహ,కోశాధికారి సైదులు, నాగేంద్ర ప్రసాద్, వెంకన్న చారి, శ్రీధర్,శ్రీకాంత్ యాదవ్, నగేష్,వల్లపు నరేష్, ఉపేందర్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

