epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సవాళ్లకు తగ్గట్టుగా పోలీసు పునర్వ్యవస్థీకరణ

సవాళ్లకు తగ్గట్టుగా పోలీసు పునర్వ్యవస్థీకరణ
ట్రాఫిక్‌, రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం
గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌, ఎస్‌ఐబీ నుంచి 513 మంది బదిలీ
డ్రగ్స్‌, సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై ప్రత్యేక దృష్టి
రెండు నెలల అటాచ్‌మెంట్‌ అనంతరం కొత్త బాధ్యతలు : డీజీపీ సీవీ ఆనంద్‌

కాకతీయ, తెలంగాణ బ్యూరో : మారుతున్న నేర స్వభావం, ప్రజా భద్రతకు ఎదురవుతున్న కొత్త సవాళ్లకు అనుగుణంగా తెలంగాణ పోలీసు శాఖలో మానవ వనరులను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం ప్రధాన సవాళ్లుగా ఉండగా.. ప్రస్తుతం డ్రగ్స్‌, సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, పెట్టుబడి మోసాలు, ట్రాఫిక్‌, రోడ్డు భద్రత, ఆహార కల్తీ వంటి అంశాలు కీలక సవాళ్లుగా మారాయని పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్‌ అకాడమీలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌, ఎస్‌ఐబీ తదితర ప్రత్యేక విభాగాల నుంచి 513 మంది సిబ్బందిని ఎనిమిది విభాగాలకు అవసరాల మేరకు కేటాయించినట్లు డీజీపీ తెలిపారు. వీరిలో ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు, 22 మంది ఎస్‌ఐలు, 14 మంది ఏఎస్‌ఐలు, 84 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 388 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. అత్యధికంగా 224 మందిని ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, రోడ్డు భద్రత విభాగానికి కేటాయించారు. ఆహార కల్తీ, డ్రగ్‌ కంట్రోల్‌కు 80 మంది, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు 79 మంది, సివిల్‌ సప్లయిస్‌కు 28 మంది, డీజీపీ కార్యాలయం–టీ స్పార్క్‌కు 27 మంది కేటాయించారు. ఏసీబీ, సీఐడీ, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలకు 25 మంది చొప్పున కేటాయించారు.

రెండు నెలల అటాచ్‌మెంట్‌.. 11 రోజుల శిక్షణ

కొత్త బాధ్యతలు అప్పగించే ముందు సిబ్బందిని ఆయా విభాగాల్లో రెండు నెలలపాటు అటాచ్‌మెంట్‌పై పనిచేయించినట్లు సీవీ ఆనంద్‌ తెలిపారు. ప్రభుత్వ అనుమతితో పోస్టుల ఏర్పాటుకు అనుగుణంగా తుది కేటాయింపులు చేశామన్నారు. సిబ్బంది విద్యార్హతలు, అనుభవం, నేపథ్యాన్ని పరిశీలించడంతోపాటు వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు చెప్పారు. కొత్త విభాగాల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్‌ అకాడమీలో 11 రోజుల ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు.

తీవ్రవాదం నుంచి సైబర్‌ నేరాల వరకు

1980, 1990 దశకాల్లో తెలంగాణలో వామపక్ష తీవ్రవాదం ప్రధాన సవాలుగా ఉండేదని డీజీపీ గుర్తుచేశారు. అప్పటి అవసరాలకు అనుగుణంగా 1987లో ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పడి, అదే క్రమంలో గ్రేహౌండ్స్‌ రూపుదిద్దుకుందని తెలిపారు. గ్రేహౌండ్స్‌, ఎస్‌ఐబీ తదితర విభాగాలు మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణలో కీలక పాత్ర పోషించాయని చెప్పారు. 2017 తర్వాత తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. 2007లో హైదరాబాద్‌లో లుంబినీ పార్క్‌, చార్మినార్‌ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో కౌంటర్‌ టెర్రరిజం సామర్థ్యాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని, దాని ఫలితంగానే ఆక్టోపస్‌ వంటి ప్రత్యేక విభాగాలు బలోపేతమయ్యాయని వివరించారు. యువతలో డ్రగ్స్‌ వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమని డీజీపీ అన్నారు. గతేడాది 835 మంది విద్యార్థుల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లు గుర్తించినట్లు తెలిపారు. మరో విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అధ్యయనంలో సుమారు 70 శాతం మంది విద్యార్థులు డ్రగ్స్‌కు గురైనట్లు తేలిందని చెప్పారు. డ్రగ్స్‌ సరఫరా గొలుసును అడ్డుకోవడంతోపాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

సైబర్‌ నేరాల్లో రూ.1,750 కోట్ల నష్టం

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, పెట్టుబడి మోసాలు, నకిలీ యాప్‌ల ద్వారా జరుగుతున్న మోసాలతో సైబర్‌ నేరాలు ప్రధాన సవాలుగా మారాయని సీవీ ఆనంద్‌ తెలిపారు. గత ఏడాది రాష్ట్రంలో సైబర్‌ నేరాల కారణంగా సుమారు రూ.1,750 కోట్ల ఆర్థిక నష్టం జరిగినట్లు చెప్పారు. సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రత్యేక విభాగాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాజా పునర్వ్యవస్థీకరణలో రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు డీజీపీ తెలిపారు. గత ఏడాది తెలంగాణలో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ప్రమాదాల నివారణ, ట్రాఫిక్‌ నియంత్రణ, అమలును బలోపేతం చేసేందుకు 224 మందిని ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, రోడ్డు సేఫ్టీ విభాగానికి కేటాయించినట్లు వెల్లడించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ఇంజినీరింగ్‌ లోపాలను సరిదిద్దేందుకు సంబంధిత శాఖలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. కొత్త బాధ్యతలు చేపడుతున్న సిబ్బంది నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని డీజీపీ సూచించారు. శారీరక దారుఢ్యాన్ని కాపాడుకోవడంతోపాటు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని చెప్పారు. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ విభాగాల్లో ఫీల్డ్‌ ఆపరేషన్లు, శిక్షణ తదితర అవసరాలకు సరిపడా సిబ్బందిని కొనసాగించినట్లు తెలిపారు. మూడు నెలల అనంతరం సిబ్బంది అవసరాలు, పనితీరును మరోసారి సమీక్షిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఆక్టోపస్‌, సీఐడీ, ఎస్‌ఐబీ, ఇంటెలిజెన్స్‌ తదితర ప్రత్యేక విభాగాల సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

హత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ అరెస్టు

హత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ అరెస్టు కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం ఖానాపురం...

దుగ్గొండి మండలంలో వివాహిత దారుణ హత్య!

దుగ్గొండి మండలంలో వివాహిత దారుణ హత్య! లక్ష్మీపురం శివారులో గొంతు కోసి చంపిన...

డ్రగ్స్ కేసులో మ‌నీ లింకులు

డ్రగ్స్ కేసులో మ‌నీ లింకులు ఆర్థిక లావాదేవీలపై సిట్‌ ఫోకస్ బ్యాంకు ఖాతాల విశ్లేషణతో...

బైక్ అదుపు తప్పి యువకుడు మృతి..!

బైక్ అదుపు తప్పి యువకుడు మృతి..! మూల మలుపు వద్ద జరిగిన రోడ్డు...

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

మానుకోటలో దొంగ బంగారం దందా?

మానుకోటలో దొంగ బంగారం దందా? నకిలీ బంగారంతో వినియోగదారులకు కుచ్చుటోపి ఇతర రాష్ట్రాల చోరీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.