కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్ గౌడ్
కాకతీయ, హైదరాబాద్: కౌండిన్య గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్ గౌడ్ నియమితులయ్యారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని కౌండిన్య గౌడ సంఘం కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు, న్యాయవాది కేఎల్‌ఎన్ ప్రసాద్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేఎల్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ సమాజ సేవా దృక్పథం కలిగిన నిరంజన్ గౌడ్ సంఘం బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తారనే నమ్మకంతో బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు పేద గీత కార్మికులను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కందికంటి రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు నిరంజన్ గౌడ్‌కు అభినందనలు తెలిపారు.

