గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇయ్యాలే
అందరికి సంక్షేమ పథకాలు
పెద్దవంగర మండలంలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్
కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికి సంక్షేమ ఫలాలు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
కాకతీయ, పెద్దవంగర : బిఅర్ఎస్ గత పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి విమర్శించారు. సోమవారం పెద్దవంగర మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. పెద్దవంగర మండలంలో గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరికైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చాయా అని ప్రశ్నించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలను అందజేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నట్లు పేర్కొన్నారు. దేశంలో సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. మండలంలో అర్హులైన పేదవారికి ఆహార భద్రత కల్పించి, ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రేవంత్ రెడ్డి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని ఆమె గుర్తు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య,విద్యార్థుల మధ్య కుల వివక్షను దూరం చేసేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నామని దాని కోసం పెద్దవంగర మండలంలోనే పాఠశాలను పెట్టబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముద్దసాని పారిజాతసురేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రంగు మురళి గౌడ్, తహసీల్దార్ వినోద్ కుమార్, ఎంపిడిఓ సురేష్, ఏఓ స్వామి నాయక్, ఏఈ రమేష్,ఏంఈఓ శ్రీనివాస్, మండల నాయకులు రవీందర్ రెడ్డి, సైదులు, హరికృష్ణ, వేణు, నరేష్, శ్రీనివాస్, సోమన్న,సీతారాం, గోపాల్, సంపత్,రవి, వేంకన్న, బోస్,సర్పంచ్ లు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

