epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాకతీయ ఎఫెక్ట్‌.. కదిలిన జిల్లా యంత్రాంగం

కాకతీయ ఎఫెక్ట్‌.. కదిలిన జిల్లా యంత్రాంగం
రాయపర్తి పీహెచ్‌సీలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ
‘పేరుకే 24 గంటల ఆసుపత్రి’ కథనానికి తక్షణ స్పందన
అపరిశుభ్రతపై ఆగ్రహం.. 24/7 వైద్యం అందాల్సిందే
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
: వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద

కాకతీయ, రాయపర్తి: వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ‘కాకతీయ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. ఆగస్టు 22న ‘పేరుకే 24 గంటల ఆసుపత్రి’ శీర్షికన ప్రచురితమైన కథనంపై జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద బుధవారం పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో మందుల నిల్వలు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, ల్యాబొరేటరీ నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. పీహెచ్‌సీలో రోగులకు 24 గంటలూ వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. సాయంత్రం వేళల్లో ఆసుపత్రి మూసివేతపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యులు, సిబ్బంది విధుల్లో అంకితభావంతో పనిచేస్తూ రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ల్యాబొరేటరీని పరిశీలించి అక్కడి వైద్య సామగ్రి, నిర్వహణపై ఇన్‌చార్జిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్‌ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మందుల నిల్వల పరిశీలన

మందుల నిల్వలను పరిశీలించిన కలెక్టర్‌ గడువు ముగిసిన మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వ ఉండకూడదని స్పష్టం చేశారు. మందులను నిబంధనల ప్రకారం సురక్షితంగా భద్రపరచాలని ఆదేశించారు. అనంతరం రోగులతో నేరుగా మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం స్థానిక ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ను కలెక్టర్‌ సందర్శించారు. చిన్నారులకు నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ తనిఖీలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ప్రకాష్‌, మండల వైద్య అధికారి అరుణ్‌ చంద్ర, స్థానిక సర్పంచ్‌ గారె సహేంద్ర బిక్షపతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.