epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆరు గ్యారంటీల అమ‌లేది..?

ఆరు గ్యారంటీల అమ‌లేది..?
వంద రోజుల్లో అన్నారు.. వెయ్యి రోజులైనా నెరవేర్చలేదు
తెలంగాణను చంద్రబాబుకు తాకట్టు
కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బంది
రుణమాఫీ, రైతుబంధు అమలులోనూ మోస‌మే
భూభారతి పేరుతో రైతుల భూములపై ఆంక్షలు
కాంగ్రెస్‌ను గద్దె దించే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం ఆగదు
జ‌న‌గామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వ‌జం

కాకతీయ, జనగామ: తెలంగాణ సాధించుకున్నది రాష్ట్ర ప్రజలు, రైతులు బాగుపడటం కోసమేనని, కానీ సీఎం రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబునాయుడికి తెలంగాణను తాకట్టు పెడుతున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు దక్కాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్‌కు దారాదత్తం చేస్తూ రాష్ట్ర రైతులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయకుండా అక్కడికి వెళ్లి లేనిపోని మాటలు చెబుతూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ చేపడుతున్న పోరాటంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పిందని పల్లా రాజేశ్వర్‌రెడ్డి గుర్తుచేశారు. అయితే వెయ్యి రోజులు పూర్తయినా హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి మరో రెండేళ్లు అధికారంలో కొనసాగే అర్హత లేదని అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతోనే హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు.

రైతులు, నిరుద్యోగులను మోసం చేశారు

రుణమాఫీ, రైతుబంధు రెండు పథకాలను ఎగ్గొట్టి కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని పల్లా ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందించామని, ప్రస్తుత ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు యువత సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేంద్రంతో దోస్తీ చేస్తూ, తెలంగాణకు వచ్చినప్పుడు బీజేపీని విమర్శిస్తున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రులు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణలో కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిన దుర్మార్గపు ప్రభుత్వం కాంగ్రెస్‌ ప్రభుత్వమని ఆరోపించారు. భూభారతి పేరుతో 22 రకాల నిషేధిత జాబితాలను ఏర్పాటు చేసి ఎమ్మార్వోలు, ఆర్డీవోలు రైతుల నుంచి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. ఈ ప్రక్రియను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ముందు పెట్టి నిర్వహిస్తూ రైతుల నుంచి భూములను లాక్కుంటున్నారని విమర్శించారు.

గద్దె దించే వరకు పోరాటం

తెలంగాణ నీళ్లు, రైతుల హక్కులు, ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగుతుందని పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు, ప్రజా సమస్యలను పరిష్కరించే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని గద్దె దించే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం ఆగదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తేల్చిచెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.