420 హామీలు అమలులో కాంగ్రెస్ విఫలం
రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది
రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా అమలు చేయాలి
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య మండిపాటు
కాకతీయ, పెద్దవంగర : కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసి రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య మండిపడ్డారు. ఉచిత విద్యుత్ సక్రమంగా అందక, రుణమాఫీ పూర్తికాక, రైతుభరోసా, రైతుబీమా అమలుకాక, యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపు మేరకు మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఈదురు ఐలయ్య మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. హామీల అమలులో కాలయాపన చేయకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ, సుదీర్ కుమార్, శ్రీరామ్ సంజయ్, బాలు నాయక్, వెంకట్రామయ్య, వేంకన్న, సుధాకర్, సమ్మయ్య, బిక్షపతి, రాము, యాకయ్య తదితరులు పాల్గొన్నారు

