ఖరీఫ్ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు
పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ
15 మంది హమాలీలకు ట్రాక్టర్, ట్రాలీ లైసెన్సులు
జమ్మికుంట మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం
కాకతీయ, జమ్మికుంట : ఖరీఫ్ సీజన్లో పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం నిర్ణయించింది. బుధవారం జమ్మికుంట కాటన్ మార్కెట్ కార్యాలయంలో చైర్పర్సన్ పుల్లూరి స్వప్న–సదానందం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జూన్, జూలై, ఆగస్టు నెలల ఆదాయ, వ్యయాలను సమీక్షించారు. ఎంఎస్పీ పరికరాలపై చర్చించారు. 15 మంది హమాలీలకు ట్రాక్టర్, ట్రాలీ లైసెన్సులు జారీకి ఆమోదం తెలిపారు. కొత్త, పాత మార్కెట్లలో సీసీ ప్లాట్‌ఫాంల మధ్య తారు పోయడం, కాంపౌండ్ వాల్, టాయిలెట్లు, గోడౌన్ రూఫ్ల నిర్వహణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. కొత్త మార్కెట్ కార్యాలయం ముందు సీసీ ప్లాట్‌ఫాం, పాత మార్కెట్లో డ్రైనేజీ ఎత్తు పెంపు, సీసీ కెమెరాల ఏర్పాటుపై చర్చించారు. మార్కెట్ కార్యదర్శి ఆర్. మల్లేశం, ద్వితీయ శ్రేణి కార్యదర్శి ఎన్. రాజా, వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, శ్రీపతి రెడ్డి, సునీల్, సతీష్, రాజేశ్వరరావు, సదానందం, సురేష్, దీక్షిత్, శ్రీనివాస్ రెడ్డి, రషీద్ పాషా, తిరుపతి, శ్యామ్ కుమార్, శ్రీనివాస్, ప్యాక్స్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.

