యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి
బీజేపీ రాష్ట్ర నాయకులు పేరం గోపికృష్ణ
కాకతీయ, హన్మకొండ : యువత ఉద్యోగాల కోసమే ఎదురుచూడకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తూ వ్యాపార రంగంలో రాణించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు పేరం గోపికృష్ణ పిలుపునిచ్చారు. హన్మకొండ రెడ్డి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన త్రిలింగ హోటల్ అండ్ రెస్టారెంట్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పేరం గోపికృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్రా యోజన వంటి పథకాలను యువత సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. హోటల్ నిర్వాహకులు రమేష్, వినోద్ ప్రజల సౌకర్యార్థం అన్లిమిటెడ్ టిఫిన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. హన్మకొండ నగరవాసులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ త్రిలింగ హోటల్ అండ్ రెస్టారెంట్ వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.

