కామారం భూభాగంపై పూర్తి ఆధారాలు
146వ సర్వే ప్రకారం ఆధారాలు మా వద్దే ఉన్నాయి
2020 నుంచి భూహక్కుల కోసం పోరాటం
వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి
గ్రామ సర్పంచ్ కోర్నబెల్లి సావిత్రి
కాకతీయ, ఏటూరునాగారం : 146వ సర్వే ప్రకారం కామారం గ్రామానికి సంబంధించిన భూభాగంపై పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని గ్రామ సర్పంచ్ కోర్నబెల్లి సావిత్రి తెలిపారు. ఆ ఆధారాలతోనే మీడియా ముందు వాస్తవాలను వివరించినట్లు పేర్కొన్నారు. 2020 నుంచి ఈ భూభాగం కోసం గ్రామస్థుల పోరాటం కొనసాగుతోందని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ తాడ్వాయి సర్పంచ్ వాస్తవాలను పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని కామారం సర్పంచ్ సావిత్రి, గ్రామస్థులు సూచించారు. పూర్తి సమాచారం లేకుండా కామారం గ్రామ భూభాగంపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తమ భూభాగం జోలికి రావద్దని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. వాస్తవాలను తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలని కోరారు. కార్యక్రమంలో కామారం గ్రామపంచాయతీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

