epaper
Monday, September 14, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పొటాష్‌ కొంటే.. మటాషేనా..!?!

పొటాష్‌ కొంటే.. మటాషేనా..!?!
నల్లబెల్లి గ్రోమోర్‌ సెంటర్‌లో పొటాష్‌ ఎరువు నాణ్యతపై రైతుల ఆందోళన
పొటాష్‌ బస్తాలో మట్టి కనిపించడంతో కంగుతిన్న రైతు
294 బస్తాల స్టాక్‌ రాగా.. ఇప్పటికే 150 వరకు విక్రయం
నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపిస్తాం
నివేదిక ఆధారంగా చర్యలు: వ్యవసాయ అధికారి బన్న రజిత

కాకతీయ, నల్లబెల్లి : పంటకు అధిక దిగుబడి రావాలని ఆశించి ఎరువు కొనుగోలు చేసిన రైతుకు.. బస్తా తెరిచేసరికి పొటాష్‌కు బదులు మట్టి కనిపించడంతో షాక్‌ తగిలింది. నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్‌ సెంటర్‌లో కొనుగోలు చేసిన పొటాష్‌ బస్తాలో మట్టి కలిసిన పదార్థం కనిపించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పంటలకు వేసే ఎరువులో నాణ్యత లోపం ఉంటే దిగుబడిపై ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు బస్తాలో ఉన్నది పొటాష్‌ ఎరువేనా? నాణ్యతా లోపమా? కల్తీ పదార్థమా? అన్నది అధికారుల పరీక్షల్లో తేలాల్సి ఉంది. మండలంలోని కొండాయిల్‌పల్లికి చెందిన రైతు కొనకటి రాజు గ్రోమోర్‌ సెంటర్‌లో ఒక్కొక్కటి రూ.2,200 చొప్పున 3 పొటాష్‌ బస్తాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. పంటకు ఎరువు వేసే సమయంలో ఒక బస్తాను తెరిచి చూడగా అందులో పొటాష్‌కు బదులుగా మట్టి కలిసినట్లు కనిపించిందని పేర్కొన్నారు. దీంతో అనుమానం వచ్చి మిగిలిన 2 బస్తాలను కూడా పరిశీలించగా వాటిలోనూ అదే తరహా పదార్థం కనిపించిందని చెప్పారు. వెంటనే ఈ విషయాన్ని గ్రోమోర్‌ సెంటర్‌ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రైతు నమ్మకంతో కొనుగోలు చేసిన ఎరువు బస్తాలోనే నాణ్యతపై అనుమానం తలెత్తితే.. పంటను నమ్ముకుని బతికే రైతు పరిస్థితి ఏమిటి? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

294 బస్తాల స్టాక్‌.. 150 బస్తాలు విక్రయం

గ్రోమోర్‌ సెంటర్‌కు కోరమండల్‌ పొటాష్‌కు సంబంధించిన 294 బస్తాల స్టాక్‌ వచ్చినట్లు సమాచారం. అందులో యాప్‌ ద్వారా బుక్‌ చేసుకున్న రైతులకు ఇప్పటికే సుమారు 150 బస్తాల వరకు విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక రైతు కొనుగోలు చేసిన 3 బస్తాల్లోనూ మట్టి కనిపించడంతో.. అదే స్టాక్‌కు చెందిన మిగిలిన బస్తాల పరిస్థితిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఎరువును కొనుగోలు చేసిన రైతులు పంటలకు వినియోగించారా? వినియోగించి ఉంటే పంటలపై ప్రభావం పడిందా? అన్నదానిపై అధికారులు వెంటనే దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. బస్తాల్లో కనిపించిన పదార్థం నిజంగా మట్టేనా? ఎరువులో నాణ్యతా లోపం ఉందా? లేక కల్తీ జరిగిందా? అన్నది ప్రయోగశాల పరీక్షల్లో తేలాల్సి ఉంది. ఈ విషయంపై వ్యవసాయ అధికారి బన్న రజితను వివరణ కోరగా.. అనుమానం ఉన్న పొటాష్‌ బస్తాల నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపిస్తామని తెలిపారు. ప్రయోగశాల నివేదిక ఆధారంగా ఎరువులో నాణ్యతా లోపం ఉన్నట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మిగిలిన స్టాక్‌ను సీజ్‌ చేసి పరీక్షించాలి

ఒకే స్టాక్‌లోని 3 బస్తాల్లో నాణ్యతపై అనుమానం తలెత్తిన నేపథ్యంలో.. సంబంధిత బ్యాచ్‌కు చెందిన మిగిలిన స్టాక్‌ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే విక్రయించిన బస్తాల వివరాలను సేకరించి, వాటిని కొనుగోలు చేసిన రైతుల నుంచి కూడా నమూనాలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎరువులో లోపం ఉన్నట్లు తేలితే విక్రయాన్ని నిలిపివేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నష్టపోయే రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రైతు చెమటతో పండే పంటకు మట్టి ఎరువుగా మారకుండా అధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి

యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి బీజేపీ రాష్ట్ర‌ నాయకులు పేరం...

కామారం భూభాగంపై పూర్తి ఆధారాలు

కామారం భూభాగంపై పూర్తి ఆధారాలు 146వ సర్వే ప్రకారం ఆధారాలు మా వద్దే...

మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా వల్లాల సదానందం గౌడ్

మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా వల్లాల సదానందం గౌడ్ కాకతీయ, హనుమకొండ :...

ఏళ్లు గడుస్తున్నా…మూత్రశాలలు ఏవి సామీ?

ఏళ్లు గడుస్తున్నా...మూత్రశాలలు ఏవి సామీ? తీరని బస్ స్టాండ్  కష్టాలు.. చోద్యం చూస్తున్న ఆర్టీసీ,పంచాయతీ...

అనారోగ్యంతో విలేకరి ఐలయ్య మృతి

అనారోగ్యంతో విలేకరి ఐలయ్య మృతి కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర...

నవోదయలో 9, 11 తరగతులకు ప్రవేశాలు

నవోదయలో 9, 11 తరగతులకు ప్రవేశాలు సెప్టెంబర్‌ 30లోగా ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్‌ 10,...

ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం

ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి జాబ్‌ క్యాలెండర్‌తో...

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు తప్పవు

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు తప్పవు మైనర్‌ డ్రైవర్లపై కాజీపేట ట్రాఫిక్‌ పోలీసుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.