epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం

ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం
ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
జాబ్‌ క్యాలెండర్‌తో సమగ్ర నోటిఫికేషన్లు జారీ చేయాలి
నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇవ్వాలి
డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్‌
కాకతీయ, ములుగు ప్రతినిధి : యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్‌ అన్నారు. ప్రభుత్వాల అసమర్థ విధానాలతో దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన డీవైఎఫ్‌ఐ ములుగు జిల్లా 2వ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు గడిచినా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించలేదని ఆనగంటి వెంకటేష్‌ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించడం వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని అన్నారు. నీట్‌, రైల్వే, బ్యాంకింగ్‌ తదితర పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు విద్యార్థులు, యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోనే సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లోని
ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి నోటిఫికేషన్లు జారీ చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడిచినా జాబ్‌ క్యాలెండర్‌తో పాటు పలు హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. సమగ్ర వివరాలతో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి ఖాళీ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరారు.
స్వయం ఉపాధికి రుణాలు మంజూరు చేయాలి
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి అందించాలని వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. స్వయం ఉపాధి కోసం ప్రకటించిన రాజీవ్‌ యువ వికాస్‌ పథకానికి దరఖాస్తులు స్వీకరించడంతోనే ప్రభుత్వం సరిపెట్టకుండా అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయాలని కోరారు. గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఏర్పాటు చేసి విద్యార్థులు, యువతను మాదకద్రవ్యాల బారినుంచి కాపాడాలని సూచించారు. ములుగు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కలువల రవీందర్‌ అధ్యక్షతన జరిగిన మహాసభలో జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అరుణ్‌, లాజర్‌, పూనెం కృష్ణబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రవి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రత్న ప్రవీణ్‌, జిల్లా నాయకులు మమత, శ్యామ్‌, రమేష్‌, రాఘవేంద్ర, సంతోష్‌, శివ, ప్రవీణ్‌, లోకేష్‌, అశోక్‌, దినేష్‌తో పాటు సుమారు 100 మంది యువత పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అనారోగ్యంతో విలేకరి ఐలయ్య మృతి

అనారోగ్యంతో విలేకరి ఐలయ్య మృతి కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర...

నవోదయలో 9, 11 తరగతులకు ప్రవేశాలు

నవోదయలో 9, 11 తరగతులకు ప్రవేశాలు సెప్టెంబర్‌ 30లోగా ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్‌ 10,...

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు తప్పవు

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు తప్పవు మైనర్‌ డ్రైవర్లపై కాజీపేట ట్రాఫిక్‌ పోలీసుల...

ఫిన్లాండ్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కు అంజుమ్‌ సుల్తానా ఎంపిక

ఫిన్లాండ్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కు అంజుమ్‌ సుల్తానా ఎంపిక వినూత్న బోధనా పద్ధతులపై అధ్యయనం సాంకేతికత,...

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.