ఏసీబీకి చిక్కిన గోవిందరావుపేట తహసీల్దార్
రూ.14 వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత
తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
భూమి పౌతి మార్పిడి కోసం లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం
ఫిర్యాదు ఆధారంగా ముందస్తు ప్రణాళికతో తనిఖీలు
ఏసీబీ అధికారుల అదుపులో తహసీల్దార్ సృజన్‌కుమార్
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా గోవిందరావుపేట తహసీల్దార్ సృజన్‌కుమార్ రూ.14 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు పట్టుకున్నారు. భూమి పౌతి మార్పిడి ప్రక్రియ కోసం లంచం డిమాండ్ చేసిన ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళికతో దాడి చేసినట్లు తెలుస్తోంది. తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారు. లంచం తీసుకున్న ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. భూమి పౌతి మార్పిడి కోసం కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారన్న ఫిర్యాదుతో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు తహసీల్దార్ సృజన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత కేసు నమోదు, స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

