epaper
Friday, October 9, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత సహాయ పరికరాలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత సహాయ పరికరాలు
ఈ నెల 27, 28, 29 తేదీల్లో పంపిణీ
15వ తేదీలోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌

కాకతీయ, హైదరాబాద్ : హుస్నాబాద్‌ నియోజకవర్గంలో అర్హులైన దివ్యాంగులు, వృద్ధులందరికీ ఉచిత సహాయ పరికరాలు అందించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీలోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి, 27, 28, 29 తేదీల్లో భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఏడిప్‌ పథకం కింద పరికరాలు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో పంపిణీ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. వీల్‌చైర్లు, వినికిడి పరికరాలు, ట్రైసైకిళ్లు, నడక కర్రలు, కళ్లద్దాలు, కృత్రిమ అవయవాలను అర్హులకు అందించనున్నట్లు తెలిపారు. 80 శాతానికి పైగా వైకల్యం ఉన్న అర్హులకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తల సమన్వయంతో అర్హులను గుర్తించి, దండోరా ద్వారా పథకంపై ప్రచారం చేయాలని సూచించారు. యూడీఐడీ కార్డు లేదా సదరం ధ్రువీకరణ పత్రం, రేషన్‌ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం, దివ్యాంగుల పింఛన్‌ కార్డు తదితర పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

మూడు జిల్లాల్లో పంపిణీ కేంద్రాలు

హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ మండలాల వారికి హుస్నాబాద్‌లో, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల వారికి ముల్కనూరులో పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. చిగురుమామిడి, సైదాపూర్‌ మండలాల వారికి అందుబాటులో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. లబ్ధిదారులను ప్రత్యేక బస్సుల్లో తరలించడంతో పాటు భోజన, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సర్వేశ్వర్‌రెడ్డి, మూడు జిల్లాల అధికారులు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ డిజేబిలిటీ రాంగోపాల్‌రెడ్డి, ఈడీపీ జాయింట్‌ మేనేజర్‌ రవిశంకర్‌, రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సర్వోత్తమరెడ్డి విజయం ఖాయం

సర్వోత్తమరెడ్డి విజయం ఖాయం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సే పట్టభద్రుల ఆశయాలను...

కానిస్టేబుల్‌ దిలీప్‌ను పరామర్శించిన గండ్ర

కానిస్టేబుల్‌ దిలీప్‌ను పరామర్శించిన గండ్ర ఆరెపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాకతీయ,...

ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు విమానాశ్రయం నుంచి వస్తున్న వాహనాల్లో మద్యం బాటిళ్ల తనిఖీ రెండు...

గౌరవెల్లి పనులకు వేగం పెంచాలి..

గౌరవెల్లి పనులకు వేగం పెంచాలి.. భూసేకరణ పూర్తి చేసి.. పనులు పరుగులు పెట్టించాలి.. గౌరవెల్లి...

14 కొత్త బార్లకు గ్రీన్‌సిగ్నల్‌

14 కొత్త బార్లకు గ్రీన్‌సిగ్నల్‌ టీసీయూఆర్‌ పరిధిలో ముందస్తు అనుమతులకు ఆహ్వానం కాకతీయ, హైదరాబాద్...

మోయినాబాద్‌ మున్సిపాలిటీలో ఏసీబీ వల

మోయినాబాద్‌ మున్సిపాలిటీలో ఏసీబీ వల ఏసీబీకి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి గుండు...

ఇన్‌స్టాకార్ట్‌లో గడువు తీరిన ఆహార పదార్థాలు

ఇన్‌స్టాకార్ట్‌లో గడువు తీరిన ఆహార పదార్థాలు కుళ్లిన కూరగాయలు.. లీకైన పాల ప్యాకెట్లు చెడిపోయిన...

ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలి

ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాక‌తీయ‌, హైదరాబాద్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.