అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి
ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డి గెలుపునకు కృషి చేయాలి
ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ పిలుపు
కాకతీయ, కేసముద్రం: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ రెడ్డిని గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ పిలుపునిచ్చారు. అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకునేలా కార్యకర్తలు అవగాహన కల్పించాలని సూచించారు. కేసముద్రంలోని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఓటరు నమోదు హెల్ప్‌డెస్క్‌ను ఆయన ప్రారంభించారు. పట్టభద్రులందరూ ఓటరు నమోదుపై దృష్టి సారించేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం వెంకటగిరి, ఇంటికనే గ్రామాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్ర రెడ్డి, మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, అంబటి మహేందర్ రెడ్డి, అల్లం నాగేశ్వరరావు, సమ్మి గౌడ్, సురేష్, శివ, వెంకన్న, దాస్రు నాయక్, సర్పంచ్ కుమార్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

