గిరిజన విద్యార్థులకు రాబిన్ హుడ్ ఆర్మీ అండ
డిగ్రీ విద్యార్థులకు 8 ల్యాప్టాప్ల పంపిణీ
కేజీబీవీ విద్యార్థినులకు 200 శానిటరీ నాప్కిన్లు
కాకతీయ, ఏటూరునాగారం: మారుమూల గిరిజన ప్రాంతాల విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమానికి అండగా నిలిచేందుకు రాబిన్ హుడ్ ఆర్మీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏటూరునాగారం పరిసర ప్రాంతాల్లో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గిరిజన డిగ్రీ విద్యార్థులకు 8 ల్యాప్టాప్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం విద్యార్థినులకు 200 శానిటరీ నాప్కిన్లు పంపిణీ చేశారు. గిరిజన విద్యార్థులు ఆన్లైన్ అభ్యాసం, విద్యా సమాచార సేకరణకు వీలుగా హైదరాబాద్కు చెందిన ఆల్షోర్ టెక్నాలజీస్ సంస్థ 8 ల్యాప్టాప్లను అందించింది. రుతుస్రావ పరిశుభ్రత, మహిళా ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతోపాటు విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు హైదరాబాద్కు చెందిన జగతి ఫౌండేషన్ 200 శానిటరీ నాప్కిన్లను అందించింది. ఈ కార్యక్రమానికి ఏటూరునాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. సూర్య ప్రకాశ్, అదనపు పోలీసు సూపరింటెండెంట్ మానన్ భట్ సహకరించారు. రాబిన్ హుడ్ ఆర్మీ ప్రతినిధులు రమేష్ బూసారపు, కిరణ్ కుమార్ కె., హర్ష, ఆల్షోర్ టెక్నాలజీస్ ఉద్యోగులు సుకాంత్ కె., ప్రదీప్ పి., జగదీష్ పి. పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాలకు విద్యా వనరులు అందించడం, బాలికల ఆరోగ్యంపై అవగాహన పెంచడం తమ లక్ష్యమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

