చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
కాకతీయ సేవా సమితి అధ్యక్షులు మండల నరసింహ రాములు
నాగపురి కార్తీక్ కు సన్మానం
కాకతీయ,వరంగల్ : ఢిల్లీలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో రెండు గోల్డ్ మెడల్స్,రెండు సిల్వర్ మెడల్స్ సాధించిన వరంగల్ జిల్లా స్థానిక రంగశాయిపేట ప్రాంతానికి చెందిన నాగపురి శ్రీనాథ్ గారి కుమారుడు నాగపురి కార్తీక్ కు శనివారం రోజున కాకతీయ సేవాసమితి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాకతీయ సేవా సమితి అధ్యక్షులు మండల నరసింహ రాములు కోలా రాము. బక్కీ శ్రీధర్, కర్రె రాజ్ కుమార్, దామర కొండ నిరంజన్ లు వారి స్వగృహానికి వెళ్లి నాగపురి కార్తీక్ ను శాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కాకతీయ సేవా సమితి అధ్యక్షులు మండల నరసింహ రాములు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి కార్తీక్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

