న్యాయవాదులపై దాడులకు అడ్డుకట్ట వేయాలి
న్యాయవాది సురేష్ కృష్ణ ముదిరాజ్
కాకతీయ, చేర్యాల : సమాజంలో న్యాయం, ధర్మం పరిరక్షణ కోసం నిరంతరం పోరాడే న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని చేర్యాల సివిల్ కోర్టు న్యాయవాది పొన్నం సురేష్ కృష్ణ ముదిరాజ్ డిమాండ్ చేశారు.న్యాయవ్యవస్థలో న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకమని, బాధితులకు న్యాయం అందించేందుకు వారు నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి న్యాయవాదులపైనే దాడులు జరగడం ఆందోళనకరమన్నారు. విధి నిర్వహణలో న్యాయవాదులకు ఎలాంటి ఆటంకాలు, బెదిరింపులు లేకుండా ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలని కోరారు.న్యాయవాదులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని, న్యాయవాదుల భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తగిన చర్యలు చేపట్టాలని సురేష్ కృష్ణ విజ్ఞప్తి చేశారు.

