బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తా
పెద్దగోని వెంకట వరప్రసాద్ గౌడ్
కాకతీయ,రాయపర్తి : బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని పెద్దగోని వెంకట వరప్రసాద్ అన్నారు.గురువారం బీసీ ఐక్య చైతన్య సమితి వరంగల్ జిల్లా నూతన రాష్ట్ర కార్యదర్శి,వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జిగా ఆయన నియమితులయ్యారు.ఈ మేరకు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆకారపు మోహన్ ప్రసాద్ కు నియామక పత్రాన్ని అందచేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ… బడుగు,బలహీన వర్గాలను చైతన్య పరుస్తూ వారి హక్కుల సాధన కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే విధంగా ఉద్యమాలను నడిపించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ జెండా ఎగురవేసేందుకు తమ వంతు కృషి చేయాలని జిల్లా,నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.బీసీ కులాలన్నింటినీ ఏకం చేస్తూ రాజ్యాధికారం దిశగా పయనించాలని పిలుపునిచ్చారు.తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు ఆకారపు మోహన్,సమితి సభ్యులకు ప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.బీసీ సమాజ హక్కుల రక్షణకు,రాజ్యాధికార సాధనకు క్షేత్రస్థాయిలో శక్తి వంచన లేకుండా శ్రమిస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు,అభిమానులు పాల్గొని ప్రసాద్ గౌడ్ ను అభినందించారు.

