epaper
Saturday, November 7, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బొడ్డుచింతలపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి

బొడ్డుచింతలపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి
అభివృద్ధి పనులను పరిశీలించిన డీపీఓ కె.కల్పన
సమిష్టి కృషితోనే జాతీయ స్థాయిలో గుర్తింపు : సర్పంచ్ వనిత
కాకతీయ, గీసుగొండ : బొడ్డుచింతలపల్లి గ్రామాన్ని అభివృద్ధి, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని జిల్లా పంచాయతీ అధికారి కె.కల్పన సూచించారు. మండలంలోని బొడ్డు చింతలపెళ్లి గ్రామాన్ని సందర్శించిన ఆమె పంచాయతీ రికార్డులు, పల్లె ప్రకృతి వనం, పారిశుధ్య నిర్వహణతో పాటు వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామంలో వంద శాతం ఇంటి పన్నుల వసూళ్లు చేపట్టాలని, తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువుల తయారీని ప్రోత్సహించాలని ఆదేశించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టడంతో పాటు నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, జల వనరులను కాపాడుకోవాలని సూచించారు. వీధిదీపాలకు స్విచ్‌లు ఏర్పాటు చేసి విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పోగుల వనిత యుగేందర్ గ్రామంలో చేపడుతున్న కార్యక్రమాలను డీపీఓకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం, సర్పంచ్ సంవాద్, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన స్వచ్ఛ, హరిత పంచాయతీ పోటీల్లో బొడ్డుచింతలపల్లి జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించిందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థుల సమిష్టి కృషితోనే ఈ గుర్తింపు లభించిందన్నారు. నర్సరీలో పెంచిన పూలు, పండ్లు, ఔషధ మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, చెత్త వేరు చేసే కేంద్రంలో తయారుచేసిన వర్మీ కంపోస్ట్‌ను రైతులకు తక్కువ ధరకు అందిస్తున్నామని పేర్కొన్నారు. వస్త్ర, జనపనార సంచుల పంపిణీతో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తున్నామని, ప్రతి శుక్రవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ దోమల నివారణకు ఫాగింగ్ చేపడుతున్నామని వివరించారు. అనంతరం ఏలుకుర్తి గ్రామ పంచాయతీని సందర్శించిన డీపీఓ అక్కడి రికార్డులను పరిశీలించారు. గ్రామంలో నీటి సంరక్షణ పనులు చేపట్టాలని, మహిళా సంఘాల భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సర్పంచ్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ శ్రీధర్ గౌడ్, సర్పంచ్‌లు దివ్యభారతి, పోగుల వనిత, పంచాయతీ కార్యదర్శి దేవేందర్, ఉపసర్పంచ్ నేరెళ్ల శైలజ, వార్డు సభ్యులు, క్షేత్ర సహాయకురాలు లత, గ్రామస్థులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగాలు సాధించే వరకు పోరాటం ఆగదు!

ఉద్యోగాలు సాధించే వరకు పోరాటం ఆగదు! కోచ్‌ ఫ్యాక్టరీ భూ నిర్వాసితులకు ఉద్యోగాలు...

జేవీవీ ఇనుగుర్తి మండల నూతన కార్యవర్గం ఎన్నిక

జేవీవీ ఇనుగుర్తి మండల నూతన కార్యవర్గం ఎన్నిక అధ్యక్షుడిగా దార్ల భాస్కర్, ప్రధాన...

చారిత్రక సంపదకు భరోసా!

చారిత్రక సంపదకు భరోసా! రామప్ప పరిరక్షణపై ఎన్‌జీటీ సుమోటో ఓపెన్‌కాస్ట్‌ తవ్వకాలతో ఆలయం, చెరువుకు...

కిసాన్‌ సభ మహాసభలను విజ‌య‌వంతం చేయాలి

కిసాన్‌ సభ మహాసభలను విజ‌య‌వంతం చేయాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సభ్యుడు...

ప్రత్యేక విద్యార్థుల ప్రతిభకు సీపీ ప్రోత్సాహం

ప్రత్యేక విద్యార్థుల ప్రతిభకు సీపీ ప్రోత్సాహం హ్యాండ్‌మేడ్ వస్తువుల కొనుగోలు.. విద్యార్థులకు స్వీట్లు...

లక్ష్యాల సాధనలోప్రథమ స్థానం దక్కాలి

లక్ష్యాల సాధనలోప్రథమ స్థానం దక్కాలి అధికారులకు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అప్పయ్య దిశానిర్దేశం కాకతీయ, హన్మ‌కొండ...

ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న బ్లూకోల్ట్ సిబ్బంది

ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న బ్లూకోల్ట్ సిబ్బంది సిబ్బందికి నగదు రివార్డులు అందించిన సీపీ ఎన్‌.శ్వేత కాకతీయ,...

కబ్జాలకు పాల్పడితే సహించేది లేదు

కబ్జాలకు పాల్పడితే సహించేది లేదు చెరువు భూముల పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తాం ధర్మసమాజ్‌ పార్టీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.