కబ్జాలకు పాల్పడితే సహించేది లేదు
చెరువు భూముల పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తాం
ధర్మసమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ సలీం పాషా
కాకతీయ, ఆత్మకూరు: గ్రామంలోని చెరువు శిఖం భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని ధర్మసమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ సలీం పాషా హెచ్చరించారు. శనివారం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. చెరువు శిఖం భూముల కబ్జా వ్యవహారంలో పరకాల సివిల్ కోర్టు నుంచి తమకు అందిన ఇంజంక్షన్ ఆర్డర్‌ను శుక్రవారం స్వీకరించినట్లు తెలిపారు. కొందరు అసత్య ఆరోపణలతో కోర్టును ఆశ్రయించారని ఆరోపించారు. చెరువు భూముల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా నాయకుడు రవి మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో తప్పిదాలకు పాల్పడిన అధికారులు వాటిని సరిదిద్దుకోవాలని, లేనిపక్షంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఏకం చేసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

