epaper
Saturday, November 14, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పరకాల బీఆర్‌ఎస్‌లో ఫ్లెక్సీ చిచ్చు!

పరకాల బీఆర్‌ఎస్‌లో ఫ్లెక్సీ చిచ్చు!
చల్లా వర్గీయులపై పోచంపల్లి అనుచరుల ఫిర్యాదు
కౌన్సిలర్‌ సహా ఏడుగురిపై కేసు నమోదు
పోలీస్‌స్టేషన్‌కు చేరిన ఆధిపత్య పోరు
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వర్గాల మధ్య ముదిరిన విభేదాలు

కాకతీయ, హ‌న్మ‌కొండ : పరకాల బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు బహిరంగ పోరుగా మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ సహా ఏడుగురిపై పరకాల పోలీసులు కేసు నమోదు చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం ఈ కేసు నమోదైంది. పోచంపల్లి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వాహకులను బెదిరించడంతోపాటు ఫ్లెక్సీలను చించివేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిణామం ఇప్పటికే రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న విభేదాలను మరోసారి తెరపైకి తెచ్చింది. తాజా కేసు నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం కూడా వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో సమాచారం. ఇద్దరు నేతలకూ అధిష్ఠానం వద్ద ప్రాధాన్యం ఉండటంతో ఈ వివాదానికి ఎలా ముగింపు పలుకుతారన్నది ఆసక్తికరంగా మారింది.

కౌన్సిలర్‌ సహా ఏడుగురిపై కేసు

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన స్వచ్ఛంద సంస్థ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పరకాలలో క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఫొటో లేకపోవడం వివాదానికి కారణమైంది. దీంతో చల్లా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోచంపల్లి వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. క్రికెట్‌ పోటీల నిర్వహణతో మొదలైన వ్యవహారం కాస్తా రెండు వర్గాల మధ్య రాజకీయ ఆధిపత్య పోరుగా మారింది. ఈ ఘటనపై పోచంపల్లి వర్గీయులు పోలీసులను ఆశ్రయించడంతో వివాదం మరో మలుపు తిరిగింది. పోచంపల్లి వర్గీయుల ఫిర్యాదు మేరకు పోలీసులు చల్లా ధర్మారెడ్డి వర్గానికి చెందిన ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వారిలో పరకాల ఒకటో వార్డు కౌన్సిలర్‌ దుబాసి వెంకటస్వామితోపాటు గొర్రె రాజు, మోరే రాజేందర్‌, ఏకు నవీన్‌, శనిగరపు నవీన్‌, మార్త విక్రమ్‌, ఒంటేరు దినేష్‌ ఉన్నారు. ఫౌండేషన్‌ క్రికెట్‌ పోటీల నిర్వాహకులను బెదిరించారని, ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అధిష్ఠానం జోక్యం తప్పనిసరా?

పరకాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వర్గాల మధ్య కొంతకాలంగా అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. పార్టీ కార్యక్రమాలు, స్థానిక రాజకీయ వ్యవహారాలు, నాయకులకు దక్కుతున్న ప్రాధాన్యం వంటి అంశాల్లో రెండు వర్గాల మధ్య సమన్వయం కొరవడినట్లు కనిపిస్తోంది. బయటకు పార్టీ ఒక్కటిగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం వర్గాల మధ్య దూరం పెరుగుతూ వస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఫ్లెక్సీ వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో ఈ కోల్డ్‌వార్‌ బహిరంగ పోరుగా మారింది. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. మరోవైపు నియోజకవర్గంలో తనకు బలమైన అనుచరగణం ఉన్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా తన వర్గం విషయంలో వెనక్కి తగ్గే పరిస్థితి లేదనే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేసులో తన వర్గానికి చెందిన కౌన్సిలర్‌తోపాటు మరికొందరి పేర్లు ఉండటంతో వారి వెనుక నిలబడాల్సిన పరిస్థితి ఆయనకు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఎవరితో ఎలా మాట్లాడి సమస్యను పరిష్కరిస్తుందన్నది కీలకంగా మారింది. ఒక వర్గానికి ప్రాధాన్యం ఇస్తే మరో వర్గం అసంతృప్తికి గురయ్యే పరిస్థితి ఉండటంతో పార్టీ పెద్దలకు ఈ వ్యవహారం సవాలుగా మారనుంది. పరకాల బీఆర్‌ఎస్‌లో నెలకొన్న ఈ గ్రూపు రాజకీయాలకు అధిష్ఠానం ఎలా చెక్‌ పెడుతుందో, రెండు వర్గాలు సయోధ్యకు వస్తాయో లేదో వేచి చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ముత్తూట్‌ మనీ గోల్డ్‌ లోన్‌ బ్రాంచ్‌ ప్రారంభం

ముత్తూట్‌ మనీ గోల్డ్‌ లోన్‌ బ్రాంచ్‌ ప్రారంభం నూతన శాఖను ప్రారంభించిన ఏఎస్పీ కాకతీయ,...

వ్యాపారి లింగారెడ్డిపై కేసు నమోదు

వ్యాపారి లింగారెడ్డిపై కేసు నమోదు ఎనుమాముల మార్కెట్‌ కార్యదర్శిని బెదిరించిన ఫ‌లితం నోటీసుల జారీపై...

మెట్టుగుట్టపై వైభవంగా నాగుల చవితి వేడుకలు

మెట్టుగుట్టపై వైభవంగా నాగుల చవితి వేడుకలుశ్రీ సుబ్రహ్మణ్యస్వామికి ఫల పంచామృత అభిషేకాలు కాకతీయ,...

సమస్యలు పరిష్కరించాకే ఇంటర్‌ విలీనం చేపట్టాలి

సమస్యలు పరిష్కరించాకే ఇంటర్‌ విలీనం చేపట్టాలి టీఎస్‌ యూటీఎఫ్‌ హనుమకొండ జిల్లా కార్యదర్శి...

రొయ్యూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం

రొయ్యూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం రూ.కోటి నిధులతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం గ్రామీణ...

లక్ష్మీపురంలో వైకుంఠధామం ప్రారంభం

లక్ష్మీపురంలో వైకుంఠధామం ప్రారంభం పేదలు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యం గ్రామీణ ప్రాంతాల...

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని నర్సింహులగూడెం ఎంపీ యుపిఎస్...

భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసు సేవలు

భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసు సేవలు ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి పోలీస్‌ స్టేషన్‌ రికార్డులు,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.