ముత్తూట్ మనీ గోల్డ్ లోన్ బ్రాంచ్ ప్రారంభం
నూతన శాఖను ప్రారంభించిన ఏఎస్పీ
కాకతీయ, ఏటూరునాగారం రూరల్: ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ముత్తూట్ మనీ గోల్డ్ లోన్ బ్రాంచ్‌ను ఏటూరునాగారం ఏఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటూరునాగారం మండలంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ లక్ష్మీకాంత్, అడ్మిన్ మేనేజర్ హరిప్రసాద్, మార్కెటింగ్ మేనేజర్ సాయిరాం, క్లస్టర్ మేనేజర్ శ్రీకాంత్, బ్రాంచ్ మేనేజర్ అనిల్‌కుమార్‌తో పాటు రాకేష్, కృష్ణ, అమరేందర్, స్వేచ్ఛ, అజ్మత్ ఖాన్, ముజీబ్ ఖాన్, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

