epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హైదరాబాద్‌లో డీసీపీపై క‌త్తుల‌తో దొంగ‌ల దాడి

డీసీపీపై క‌త్తితో దాడికి య‌త్నం

సెల్‌ఫోన్ దొంగ‌ల‌ను అడ్డుకునేందుకు య‌త్నం

తోపులాట‌లో కింద‌ప‌డిపోయిన గ‌న్‌మెన్‌

ఆయ‌న వెప‌న్‌తో దొంగ‌ల‌పై డీసీపీ చైతన్య కాల్పులు

ఇద్ద‌రిలో ఒక‌రికి తీవ్ర‌గాయాలు.. ద‌వాఖాన‌కు త‌ర‌లిపు

చాద‌ర్‌ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వ‌ద్ద ఘ‌ట‌న‌

ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించిన పోలీస్ ఉన్న‌తాధికారులు

కాకతీయ, హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో మొన్న ప్ర‌మోద్ అనే పోలీసు కానిస్టేబుల్‌ను హ‌త్య చేసిన ఘ‌ట‌న రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించిన విష‌యం తెలిసిందే. తాజాగా హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇలాంటి షాకింగ్‌ ఘటన వెలుగుచూసింది. సెల్ ఫోన్ దొంగను పట్టుకునే యత్నంలో సౌత్‌ఈస్ట్‌ డీసీపీ చైతన్యపై దాడికి యత్నం జరిగింది. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నింగా.. దొంగలు వారిపైనే తిరగబడ్డారు. ఈక్రమంలో డీసీపీ చైతన్య గన్‌మెన్‌ దగ్గరున్నతుపాకీతో వారిపై కాల్పులు జర‌ప‌డం క‌ల‌క‌లంరేపింది..

అస‌లేం జ‌రిగింది ?

హైద‌రాబాద్ సీపీ కార్యాల‌యంలో పోలీసు ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైత‌న్య కుమార్ హాజ‌ర‌య్యారు. స‌మావేశం ముగిసిన అనంత‌రం చైత‌న్య తిరిగి త‌న కార్యాల‌యానికి వ‌స్తున్నారు. చాద‌ర్‌ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వ‌ద్దకు రాగానే ఓ ఇద్ద‌రు దొంగ‌లు సెల్‌ఫోన్ల‌ను చోరీ చేసి పారిపోతున్నారు. ఆ సెల్‌ఫోన్ స్నాచ‌ర్స్‌ను గ‌మ‌నించిన డీసీపీ చైత‌న్య త‌న గ‌న్‌మెన్‌ను అప్ర‌మ‌త్తం చేశారు. డీసీపీ, గ‌న్‌మెన్ క‌లిసి ఆ ఇద్ద‌రు దొంగ‌ల‌ను ప‌ట్టుకునేందుకు య‌త్నించారు. ఈక్ర‌మంలో దొంగ‌లు.. డీసీపీపై క‌త్తితో దాడి చేసి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించారు. దొంగ‌ల‌ను గ‌న్‌మెన్ అడ్డుకునేందుకు య‌త్నించాడు. కానీ తోపులాట‌లో గ‌న్‌మెన్ కింద ప‌డిపోయాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన డీసీపీ చైత‌న్య‌.. గ‌న్‌మెన్ వ‌ద్ద ఉన్న వెప‌న్‌ను తీసుకుని దొంగ‌ల‌పై కాల్పులు జ‌రిపాడు. ఇద్ద‌రిలో ఒక దొంగ‌కు తీవ్ర గాయాల‌య్యాయి. అత‌న్ని నాంప‌ల్లి కేర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో పోలీసు యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది.

ఘ‌ట‌నాస్థ‌లిని ప‌రిశీలించిన ఉన్న‌తాధికారులు

కాల్పులు చోటు చేసుకున్న విక్టోరియా గ్రౌండ్ వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు. ఘ‌ట‌నాస్థ‌లిని సౌత్, సెంట్ర‌ల్ జోన్ డీసీపీలు స్నేహామెహ్రా, శిల్పావ‌ళితో పాటు పలువురు సీఐలు, ఎస్సైలు ప‌రిశీలించారు. డీసీపీతో పాటు గ‌న్‌మెన్‌కు ఎలాంటి గాయాలు కాలేద‌ని, సుర‌క్షితంగా ఉన్న‌ట్లు ఉన్న‌తాధికారులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సవాళ్లకు తగ్గట్టుగా పోలీసు పునర్వ్యవస్థీకరణ

సవాళ్లకు తగ్గట్టుగా పోలీసు పునర్వ్యవస్థీకరణ ట్రాఫిక్‌, రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌,...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

హత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ అరెస్టు

హత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ అరెస్టు కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం ఖానాపురం...

దుగ్గొండి మండలంలో వివాహిత దారుణ హత్య!

దుగ్గొండి మండలంలో వివాహిత దారుణ హత్య! లక్ష్మీపురం శివారులో గొంతు కోసి చంపిన...

డ్రగ్స్ కేసులో మ‌నీ లింకులు

డ్రగ్స్ కేసులో మ‌నీ లింకులు ఆర్థిక లావాదేవీలపై సిట్‌ ఫోకస్ బ్యాంకు ఖాతాల విశ్లేషణతో...

బైక్ అదుపు తప్పి యువకుడు మృతి..!

బైక్ అదుపు తప్పి యువకుడు మృతి..! మూల మలుపు వద్ద జరిగిన రోడ్డు...

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.