epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సానుభూతి ఓట్లకు కేటీఆర్ పాకులాట‌

  • గోపీనాథ్‌ మృతిపై త‌ల్లి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాలి
  • రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార‌శాఖ‌ మంత్రి పొంగులేటి

కాక‌తీయ‌, హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌జ‌లకు చెందిన కోట్లాది రూపాయిల‌ను కొల్ల‌గొట్టిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీత సెంటిమెంట్‌ను ప్ర‌జ‌ల‌పై ప్ర‌యోగించి ప‌బ్బం గడుపుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని రాష్ట్ర రెవెన్యూ ,హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి, రెహ‌మ‌త్ న‌గ‌ర్ డివిజ‌న్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న బోర‌బండ డివిజ‌న్ తో స‌హా వివిధ ప్రాంతాల‌లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యారు. బోర‌బండ‌లోని సాయిబాబాన‌గ‌ర్‌,జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోని వివిధ అసోసియేష‌న్ల స‌భ్యులు, ప‌లువురు అర్చ‌కులు మంత్రి పొంగులేటి స‌మ‌క్షంలో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్‌రెడ్డి, రెహ్మ‌త్‌న‌గ‌ర్ కార్పొరేట‌ర్ సి.ఎన్‌. రెడ్డి ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ కండువాలు క‌ప్పి మంత్రి పొంగులేటి వారికి స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ దివంగ‌త మాగంటి గోపీనాథ్‌ విష‌యంలో కేటీఆర్ విల‌న్ అని సాక్షాత్తూ గోపీనాథ్‌ త‌ల్లిగారే ప్ర‌క‌టించార‌ని అన్నారు. గోపీనాథ్‌ మృతి ఓ మిస్ట‌రీ అని ఆమె చెప్ప‌డం చూస్తే క‌ల్వ‌కుంట్ల కుటుంబ వైఖ‌రి అంద‌రికీ అర్ద‌మ‌వుతుంద‌న్నారు. గతంలో వేలాది మంది తెలంగాణ యువ‌త‌ను ఉద్య‌మానికి ఆహుతిచ్చిన కేసీఆర్ త‌ర్వాతి కాలంలో ఎంద‌రో ఉద్య‌మ నాయ‌కుల‌ను పాతాళానికి తొక్కేశార‌ని గుర్తు చేశారు. తాజాగా క‌విత‌ను కూడా బ‌య‌ట‌కు పంపి కాళేశ్వ‌రంలో వ‌చ్చిన క‌మీష‌న్లలో వాటా ఇవ్వ‌కుండా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు చేస్తున్నార‌ని ఆరోపించారు.

క‌విత జాగృతి సంస్ధ కార్య‌క‌ర్త‌లు ఇప్పుడు బిఆర్ఎస్‌కు ఈ ఎన్నిక‌ల్లో బుద్దిచెబుతార‌న్న ఆశాభావాన్ని మంత్రి గారు వ్య‌క్తం చేశారు. హీన రాజ‌కీయ చ‌రిత్ర‌క‌లిగిన కేసీఆర్ కుటుంబ రాజ‌కీయాల‌కు మాగంటి గోపీనాధ్ కుటుంబం ఇప్పుడు రోడ్డున ప‌డింద‌ని అన్నారు. గ‌తంలో ఆంధ్ర‌ప్రదేశ్ లో టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబును అరెస్ట్ చేసిన‌ప్పుడు ఇక్క‌డి సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్లు శాంతియుతంగా నిర‌స‌న తెలిపితే వారిని ఆ రాష్ట్రానికి వెళ్లిపోయి ధ‌ర్నాలు చేసుకోమ‌న్న కేటీఆర్ ఇప్పుడు తెలుగుదేశం సానుభూతిప‌రుల ఓట్ల కోసం ప్రాకులాడుతున్నార‌ని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. మ‌రోవైపు ప్ర‌జ‌ల‌కు ముఖం చూపించ‌లేక అసెంబ్లీకి రాని కేసీఆర్ ఇప్పుడు ఫాంహౌస్ దాట‌డం లేద‌ని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌ల‌కు నెల‌కు 23వేల క్వింటాళ్ల స‌న్న‌బియ్యం పంపిణీ చేస్తున్నామ‌ని దేశంలోనే ఇటువంటి ప‌ధ‌కం ఒక్క తెలంగాణ‌లోనే అమ‌లు చేస్తుండ‌గా ఈ బియ్యం పంపిణీని విష‌యంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అవాకులు చ‌వాకులు మాట్లాడుతున్నార‌ని అన్నారు. స‌న్న‌బియ్యం పంపిణీ ఆపేస్తామంటూ కాంగ్రెస్ వారు ఎక్క‌డా ఎవ‌రూ చెప్ప‌క‌పోయినా కేవ‌లం ఓట్ల రాజ‌కీయంతో బిజేపీ కిష‌న్ రెడ్డి అలా మాట్లాడ‌డం స‌రికాద‌న్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.