epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ప్రారంభం
రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

కాకతీయ, వరంగల్ సిటీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక పేద ప్రజలకు రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తున్నామని, రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, రేషన్ కార్డు మంజూరైన వారికి వెంట వెంటనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో రూ. 5 కోట్ల 87 లక్షల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. అందులో జిడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో 15వ ఆర్థిక సంఘ, జనరల్ ఫండ్ నిధులు, ఎస్ ఎఫ్ సి పథకాల కింద రూ. 4 కోట్ల 87 లక్షల వ్యయం తోబల్దియా పరిధి 32 వ డివిజన్ బి ఆర్ నగర్ లో బస్తి దవాఖాన, ఎన్ ఎన్ నగర్ లో సిసి రోడ్లు, జ్యోతినగర్ లో సిసి రోడ్లు, అంబేడ్కర్ భవన్ కమ్యూనిటీ హాల్, బీరన్నకుంట కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు, 28వ డివిజన్ బట్టలబజార్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కిచెన్ షెడ్ 42వ డివిజన్ రంగశాయిపేట లో నిర్మించనున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పనులకు శంఖుస్థాపన చేశారు. ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో కోటి రూపాయల వ్యయంతో మాషుఖ్ రబ్బానీ దర్గా లో చేపట్టే అభివృద్ధి పనులు ప్రారంభించారు. లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డు లు అందించారు. రంగశాయిపేట కమ్యూనిటీ హాల్లో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తుందన్నారు. గత ప్రభుత్వం రేషన్ ద్వారా దొడ్డు బియ్యం ఇచ్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక పేద ప్రజలకు రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. వరంగల్ మహా నగరాన్ని హైదరాబాద్ మాదిరిగా సమగ్ర అభివృద్ధి చేయుటకు గాను మామునూరు విమానాశ్రయం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు ముందుకెళ్తున్నామని మంత్రి తెలిపారు. వరంగల్ నగరాన్ని ముంపు నుండి కాపాడేందుకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనవు కలెక్టర్ సంధ్యారాణి, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, కార్పొరేటర్లు, బల్దియా ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.