epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.!!

కాకతీయ, స్టేషన్ ఘనపూర్ : రాష్ట్రాన్ని నాశనం చేసిందే బీఆర్ ఎస్ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సుద్దపూసల లాగా నీతులు చెప్పే అర్హత ఆ పార్టీ నాయకులకు లేదన్నారు. వేలేరు, ధర్మసాగర్ మండల కేంద్రాలలోని రైతు వేదికలలో శ‌నివారం ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వేలేరు మండలంలో 13 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.13.01 లక్షల చెక్కులు, 19 మంది సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు రూ.5.77 లక్షల చెక్కులు, ధర్మసాగర్ మండలంలో 21 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.21.02 లక్షల చెక్కులు, 41 మంది సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు రూ.12.38 లక్షల చెక్కులు పంపిణీ చేశారు.

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికై 21 నెలల్లోనే 1026 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకువచ్చానన్నారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతోనే సాధ్యమైంద‌ని పేర్కొన్నారు. రానున్న మూడు సంవత్సరాల్లో మరో రెండు వేల కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు.

నా ఏకైక ఎజెండా నియోజకవర్గ అభివృద్ధి. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తాను అని స్పష్టం చేశారు. త‌న‌ను రాజీనామా చేయమనే హక్కు బీఆర్ఎస్‌కు లేదని, ఆనాడు ఆ పార్టీలో చేరిన 36 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు పెళ్లి చేసిన మూడు నెలల్లోనే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందుతున్నాయని చెప్పారు. 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేసినట్లు గుర్తు చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సన్న బియ్యం పంపిణీ, సిసి రోడ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను వివరించారు. గండి రామారం లిఫ్ట్-1 పనులను ఈ ఏడాది చివ‌రి నాటికి పూర్తి చేసి వేలేరు, చిల్పూర్ మండలాలకు రెండవ పంటకు సాగునీరు అందిస్తానని ఆయ‌న హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, ఏవో, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.