epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కమీషన్ల కోసమే మేడారం జాతర పనుల కాలయాపన

కమీషన్ల కోసమే మేడారం జాతర పనుల కాలయాపన

బిఆర్ఎస్ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి

కాకతీయ, ములుగు ప్రతినిధి: మేడారం జాతరకు ఇంకా 70 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగా ఇప్పటికీ అభివృద్ధి పనులు ప్రారంభం కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి ఆరోపించారు. ఆదివారం ఆమె పార్టీ శ్రేణులతో కలిసి సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతర కోసం వెయ్యి కోట్లు కేటాయిస్తామని ప్రకటించి, ఇప్పుడు కేవలం 117 కోట్లు మాత్రమే విడుదల చేసింది అని, ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం, కొన్ని చోట్ల నత్తనడకన సాగడం వల్ల ఈసారి జాతర సమయానికి సదుపాయాలు పూర్తవుతాయా లేదా అన్న అనుమానాలు ప్రజల్లో పెరుగుతున్నాయి అని పేర్కొన్నారు. జాతరలో పాల్గొనే లక్షలాది భక్తులకు తాగునీరు, టాయ్లెట్లు, పార్కింగ్, రోడ్ల విస్తరణ, చెట్లు–నీడ వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు. పచ్చని మేడారం ఇప్పుడు ఎడారిలా మారిపోయింది అని, చిన్న వ్యాపారుల జీవనోపాధి దెబ్బతిన్నది అని, గ్రామస్తులు తమ ఇంటి ముందు ఉన్న షేడ్లు, పందిళ్లు తొలగించినా రోడ్లు, కల్వర్టులు మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గుడి మూడు ఎకరాల్లో ఉంటే, దాని వెనక 20 ఎకరాలు రైతుల భూములు జప్తు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని, ఇది ఆదివాసీల అస్తిత్వంపై దాడి చేసినట్లే అని, వనదేవతల ఆవరణలో ఉన్న 300 పైగా చెట్లను నరికేయడం పాపం అని, గ్రామ సభ ఏర్పాటు చేయకుండా చెట్లు తుడిచేయడానికి ఎవరు అధికారం ఇచ్చారు అని నాగజ్యోతి ప్రశ్నించారు. అలాగే ఐటీడీఏ షాపింగ్ కాంప్లెక్స్‌లు, పబ్లిక్ టాయ్లెట్స్‌ను వాడకం లోకి తీసుకోకపోవడం, పాత ప్రాజెక్టులను వదిలేసి కొత్త మాస్టర్ ప్లాన్ పేరుతో రైతుల పంట పొలాలపై కన్నేయడం దారుణమని ఆమె విమర్శించారు. జాతర సమయంలో ప్రజల సౌకర్యాలకే ప్రాధాన్యం ఇవ్వాలి కానీ ఈ ప్రభుత్వం కమీషన్ల కోసమే పనులను ఆలస్యం చేస్తోంది అని, అధికారులు, కాంట్రాక్టర్లు లాభాల పంటలు కోసుకునేలోపు భక్తులు, స్థానికులు నష్టపోతున్నారు అని బడే నాగజ్యోతి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య, రామ సహాయం శ్రీనివాసరెడ్డి, పోగు నాగేష్, చిడం బాబురావు, శ్రీధర్ గొంది, శివరాజ్, సమ్మిరెడ్డి, కొర్నిబెల్లి శేషగిరి, సురేష్, ఇంద్రారెడ్డి, జీడిబాబు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.