epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మానేరు చెక్‌డ్యామ్ ధ్వంసం

మానేరు చెక్‌డ్యామ్ ధ్వంసం

రైతుల్లో ఆందోళన
మూడు కోట్ల నష్టం
పోలీసులు విచారణలోకి
పలు పార్టీ నాయకుల సందర్శనలు.

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట శ్రీరాంపూర్ మండలం తనుగుల శివారులో మానేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్ అనుమానాస్పదంగా ధ్వంసమై ప్రాంతంలో కలకలం రేగింది. నవంబర్ 21 రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై ఇరిగేషన్ శాఖ ఏఈ పాలకుర్తి రవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. దాదాపు 90 మీటర్ల మేర కూలిన ఈ చెక్‌డ్యామ్ వల్ల సుమారు వెయ్యి ఎకరాల సాగుకు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. మొత్తం నష్టం మూడు కోట్లకు చేరుకున్నట్లు అంచనా.చెక్‌డ్యామ్ ధ్వంసం విషయం వెలుగులోకి రావడంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్, ఇరిగేషన్ శాఖ అధికారులు, పోలీసులు స్థలాన్ని పరిశీలించి ధ్వంసం విధానంపై క్లారిటీ కోసం విచారణ కొనసాగిస్తున్నారు.

దాసరి మనోహర్ రెడ్డి పరిశీలన
“ ఇది ఇసుక మాఫియా పనే”

ఓదెల మండలం గుంపుల గ్రామ పరిధిలో కూలిపోయిన చెక్‌డ్యామ్‌ను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సందర్శించారు. కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మానేరు నదిపై మొత్తం 23 చెక్‌డ్యాంలు నిర్మించిందని, వాటిలో గుంపుల,శంభునిపల్లి చెక్‌డ్యామ్ వేలాది మంది రైతులకు వరమైందని గుర్తుచేశారు. ఈ స్థాయిలో డ్యామ్ కూలిపోవడం యాదృచ్ఛికం కాదని, ఇసుక మాఫియా స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా నాశనం చేసినట్లు కనిపిస్తోందని ఆయన మండిపడ్డారు. బాధ్యులను గుర్తించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే డ్యామ్ పునర్‌నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను కోరారు. మాజీ సర్పంచ్ సంపత్, ఎల్లస్వామి, యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్ తదితరులు ఆయనతో పాటు ఉన్నారు.

“ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఉపేక్ష లేదు” – వొడితల ప్రణవ్

శంభునిపల్లి–గుంపుల చెక్‌డ్యామ్‌ను పరిశీలించిన హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత రైతులకు అత్యంత ఉపయోగకరమైన చెక్‌డ్యామ్ ఇలా ధ్వంసం కావడం తీవ్ర నిర్లక్ష్యమో లేక దురుద్దేశమో అని ప్రశ్నించారు. పూర్తి స్థాయి నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు.ఈ విషయమై ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. వెంటనే మరమ్మత్తుల కోసం నిధులు కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కూడా త్వరలో ఘటన స్థలాన్ని పరిశీలిస్తారని చెప్పారు. రానున్న వేసవిలో రైతులకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని ప్రణవ్ స్పష్టం చేశారు.మొత్తం మీద…చెక్‌డ్యామ్ ధ్వంసం వ్యవహారం రెండు జిల్లాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రైతులు ఆందోళన చెందుతుండగా, రాజకీయ నాయకులు వరుసగా స్పందిస్తున్నారు. పోలీసులు, ఇరిగేషన్ శాఖ సంయుక్తంగా విచారణను వేగవంతం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.