ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు
బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం
కాకతీయ,శంకరపట్నం:కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ చొరవతో శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల్లో బోరుబావుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఎంపీ నిధులతో మంజూరైన బోరుబావుల నిర్మాణ పనులను శుక్రవారం వంకాయగూడెం, అంబాలాపూర్, ఎరడపల్లి గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
గ్రామాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బోరుబావులు మంజూరు చేసిన ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు ఆయా గ్రామాల సర్పంచులు, పాలకవర్గ సభ్యులు, బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. బోరుబావుల ఏర్పాటుతో గ్రామాల్లో తాగునీటి సమస్యకు కొంతమేర పరిష్కారం లభిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు వెన్నెం మల్లేష్, కొయ్యడ రజిత, వడ్లకొండ వినోద్, ఉపసర్పంచులు రేణుక, మహేష్, రాజశేఖర్, బీజేపీ నాయకులు అలివేలు సమ్మిరెడ్డి, దండు కొమురయ్య, రాసమల్ల శ్రీనివాస్, నరేష్, రాజిరెడ్డి, గుర్రం శ్రీనివాస్‌తో పాటు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

