epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హెచ్‌పీలో భారీగా లేఆఫ్స్.. ఏఐ ఎఫెక్టేనా..?

హెచ్‌పీలో భారీగా లేఆఫ్స్.. ఏఐ ఎఫెక్టేనా..?
హెచ్‌పీ లేఆఫ్స్‌ కలకలం
ఏఐ ధాటికి 6 వేల ఉద్యోగులకు షాక్‌
ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌, ఆపరేషన్స్‌, కస్టమర్ సపోర్ట్‌పై కోతలు

కాక‌తీయ‌, బిజినెస్ : ప్రపంచ ఐటీ రంగంలో లేఆఫ్స్‌ పర్వం ఆగే ఆలోచనలో కనిపించడం లేదు. ఒకప్పుడు కోవిడ్‌ మాంద్యం పేరుతో ప్రారంభమైన ఉద్యోగ కోతలు, ఇప్పుడు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత మార్పుల వైపు దూసుకెళ్తున్నాయి. మరో టెక్‌ దిగ్గజం హెచ్‌పీ (HP) కూడా ఇదే దారి పట్టింది. సంస్థ తాజాగా ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించడంతో టెక్‌ వర్గాల్లో కలకలం రేగింది.

రాబోయే రెండు నుంచి మూడు ఏళ్లలో సుమారు 6,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై చెప్ప‌బోతున్న‌ట్లు హెచ్‌పీ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం 4,000 నుంచి 6,000 వరకు ఉద్యోగులను తగ్గించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంఖ్య, ప్రస్తుతం ఉన్న సిబ్బందిలో దాదాపు 10 శాతం. అంటే, ప్రతి పది మంది ఉద్యోగుల్లో ఒకరి ఉద్యోగం మాయమవుతుందన్న మాట.

సంస్థ యాజమాన్యం ఈ నిర్ణయానికి ప్రధాన కారణం కృత్రిమ మేధ విస్తృతి అని స్పష్టం చేసింది. ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌, ఇంటర్నల్ ఆపరేషన్స్‌, కస్టమర్ సపోర్ట్‌ వంటి కీలక విభాగాల్లో ఏఐ ఆధారిత టూల్స్, ఆటోమేషన్‌ వినియోగాన్ని పెంచాలని హెచ్‌పీ భావిస్తోంది. ఈ మార్పులు అమలు చేయడానికి సిబ్బంది సంఖ్యను క్రమబద్ధీకరించడం తప్పనిసరి అవుతోందని కంపెనీ సీఈఓ ఎన్రిక్ లారెస్ పేర్కొన్నారు. 2024 అక్టోబరు నాటికి హెచ్‌పీకి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 58,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే, కొత్త నిర్ణయంతో ఈ సంఖ్య గణనీయంగా పడిపోనుంది. విశేషం ఏమిటంటే, ఈ ఏడాది ఆరంభంలోనే హెచ్‌పీ 1,000-2,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మళ్లీ కొత్త రౌండ్ లేఆఫ్స్ ప్రకటించడంతో ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది.

గూగుల్‌, మెటా, అమెజాన్‌, ఇన్ఫోసిస్‌ వంటి ప్రపంచ ప్రముఖ సంస్థలు ఇప్పటికే వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఏఐ ట్రెండ్ వేగంగా విస్తరిస్తుండటంతో టెక్‌ కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టడం, తమ ఆపరేషన్లను పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో హెచ్‌పీ నిర్ణయం కూడా ఏఐ రివల్యూషన్‌ భాగమనే చెప్పాలి. హెచ్‌పీ ఉద్యోగులకు ఇది పెద్ద షాక్‌ అయినప్పటికీ, టెక్ ప్రపంచం మళ్లీ ఒక ముఖ్యమైన మలుపు దిశగా సాగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏఐ ప్రవేశం మరింత వేగవంతం అవుతున్నందున వచ్చే నెలల్లో ఇంకా ఎన్నో సంస్థలు ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రంగ నిపుణుల అంచనా.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రికార్డు స్థాయికి పసిడి ధరలు

రికార్డు స్థాయికి పసిడి ధరలు కిలో వెండి రూ. 2.70 లక్షలు 10 గ్రాముల...

అమెజాన్ నుంచి ఏఐ ఫోన్

అమెజాన్ నుంచి ఏఐ ఫోన్ అలెక్సాతో స్మార్ట్ ఫోన్ యుగంలో గేమ్...

డాలర్ దెబ్బకు గోల్డ్ స్లిప్!

డాలర్ దెబ్బకు గోల్డ్ స్లిప్! ప‌డిపోతున్న బంగారం ధ‌ర‌లు డాలర్ బలపడటమే ప్రధాన కారణం వడ్డీ...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంచలనం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంచలనం తప్పుడు పెట్టుబ‌డుల‌ను ప్రొత్స‌హించిన అధికారుల‌పై కొర‌డా ముగ్గురు అధికారుల‌పై వేటు...

రూ.30 వేలు తగ్గిన వెండి

రూ.30 వేలు తగ్గిన వెండి ఒక్క రోజులోనే దిగొచ్చిన ధ‌ర‌ 24 క్యారెట్ల 10...

బ్యాంక్ కస్టమర్లకు ఊరట?

బ్యాంక్ కస్టమర్లకు ఊరట? అన్ని బ్యాంకులకు ఒకే ఛార్జీలు, నిబంధనలు! ఆర్బీఐ కసరత్తు షురూ కాక‌తీయ‌,...

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ A07 5G

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ A07 5G త్వరలో విడుదలకు స‌న్నాహాలు కాక‌తీయ‌, బిజినెస్ :...

తీవ్ర సంక్షోభం… ఫ్లైట్ల రద్దుతో కుప్పకూలిన ఇండిగో షేర్లు..!

తీవ్ర సంక్షోభం… ఫ్లైట్ల రద్దుతో కుప్పకూలిన ఇండిగో షేర్లు..! సిబ్బంది కొరత వేళ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.