epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ధరల నియంత్రణపై ఏం చ‌ర్య‌లు తీసుకుంటున్నారు?

ధరల నియంత్రణపై ఏం చ‌ర్య‌లు తీసుకుంటున్నారు?
లోక్‌సభలో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, నాణ్యత నియంత్రణలో లోపాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన వస్తువులు సరైన ధరకే, ప్రమాణాలతో అందేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. ధరల పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా నిత్యావసరాలు న్యాయమైన ధరలకు విక్రయించబడుతున్నాయో లేదో కేంద్రం ఎలా పర్యవేక్షిస్తుందో వివరించాలని కోరారు. అలాగే వాణిజ్య దుకాణాల తనిఖీలు, నాణ్యత నియంత్రణ పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలన్నారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు అడిగిన ప్రశ్నకు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార – పొదుపు పంపిణీ శాఖ సహాయమంత్రి బి.ఎల్. వర్మ సమాధానమిస్తూ—దేశవ్యాప్తంగా 575 కేంద్రాల నుంచి రోజూ 38 కీలక ఆహార పదార్థాల ధరలను సేకరించి ప్రైస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ద్వారా కేంద్రానికి అప్‌లోడ్‌ చేస్తున్నట్టు వివరించారు. దీంతో మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులను సమయానికి గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006 ప్రకారం ప్రతి న్యాయధరక దుకాణం ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఏ‌.ఐ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పొందాలని గుర్తుచేశారు. పరిశుభ్రత, శానిటేషన్‌పై 2011లో రూపొందించిన నియమావళి ప్రకారం దుకాణాలు నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు. ఉల్లంఘనలు జరిగితే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఏ‌.ఐ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రాంతీయ కార్యాలయాల సహకారంతో క్రమం తప్పకుండా తనిఖీలు, సర్వేలెన్స్, యాదృచ్ఛిక నమూనాల సేకరణ నిర్వహిస్తూ నాణ్యతను నిర్ధారిస్తోందని మంత్రి చెప్పారు. ప్రజలకు న్యాయమైన ధరలకే సరుకులు, నాణ్యమైన ఆహార పదార్థాలు అందాలంటే పర్యవేక్షణలో పారదర్శకత అవసరమని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు. కేంద్రం స్పష్టమైన వ్యవస్థలు అమలు చేయాలని ఈ సందర్భంగా ఎంపీ కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.