epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గ్రామాల ముఖచిత్రాన్ని మార్చింది మోదీ ప్రభుత్వమే

గ్రామాల ముఖచిత్రాన్ని మార్చింది మోదీ ప్రభుత్వమే

బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి,సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర

కాకతీయ, కరీంనగర్ : దశాబ్దాల పాటు దేశం,రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు గ్రామాలకు అవసరమైన కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేని పరిస్థితి నెలకొన్నదని,2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గ్రామాల పట్ల నిజమైన స్పృహతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర అన్నారు.బుధవారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, 55 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెలో ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి చూపలేదని విమర్శించారు. రోడ్లు, మురికి కాలువలు, వీధిదీపాలు వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేకపోయిందని మండిపడ్డారు. గ్రామాల్లో మహిళల ఆత్మగౌరవం, వారి సమస్యలు కాంగ్రెస్ పాలనలో ఏమాత్రం ప్రాధాన్యం పొందలేదని అన్నారు.పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేసే దిశలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అపార కృషి చేసిందని కళ్యాణ్ చంద్ర పేర్కొన్నారు. అంతర్గత రహదారులు, వీధిదీపాలు, సెంట్రల్ లైటింగ్, మురికి కాలువలు, డంపింగ్ యార్డులు, అంగన్‌వాడీ కేంద్రాలు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు వంటి అనేక కీలక పనులు భారీగా పూర్తవ్వడం మోదీ ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమన్నారు.గ్రామాల్లో మహిళలు గౌరవంగా జీవించేందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, కట్టెల పొయ్యిల బాధల నుంచి విముక్తి కల్పించిన ఉజ్వల గ్యాస్ యోజన వంటి పథకాలు గ్రామీణ కుటుంబాలకు దేవుడిచ్చిన వరమని పేర్కొన్నారు. నేడు పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని స్పష్టం చేశారు.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సర్పంచులను దయనీయ స్థితికి నెట్టివేసిందని ఆరోపించిన ఆయన, గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు రాక అనేక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి బీఆర్‌ఎస్ పాలనలోనే వచ్చిందని అన్నారు. కేంద్రం విడుదల చేసిన నిధులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని విమర్శించారు.రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా సర్పంచులను అప్పుల బారిన పడేసిందని తెలిపారు. గ్రామాలకు అవసరమైన నిధులు ఇవ్వకుండా, ఇప్పుడు మాత్రం 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం తొందరపడి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర నిధులతో జరిగిన పనులకు కూడా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు క్రెడిట్ తమదేనని చెప్పుకోవడం ప్రజలను మోసం చేయడమేనన్నారు.కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓటు వేయడం దండగ అయిందని, గ్రామాల అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. మాయ మాటలకు మోసపోకుండా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశమివ్వాలని పిలుపునిచ్చారు.కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు వేల కోట్లు మంజూరు చేయించారని కళ్యాణ్ చంద్ర తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.