epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తిరుమలలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

తిరుమలలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
అర్ధరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనం ఆరంభం
గోవింద నామస్మరణతో మారుమోగిన ఏడుకొండ‌లు
కుటుంబ స‌మేతంగా స్వామి వారిని ద‌ర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

తిరుమల : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు తిరుమలలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి తరువాత 1.30 గంటల నుంచి టీటీడీ వైకుంఠద్వార దర్శనాలను ప్రారంభించింది. తొలుత వీఐపీలకు ఉత్తర ద్వారం గుండా దర్శనం కల్పించగా, సాధారణ భక్తులకు ఉదయం 6 గంటల నుంచి దర్శనాలు అందించనున్నారు. తెల్లవారుజాము 2 గంటల నుంచే భక్తులు ఉత్తర ద్వార దర్శనార్థం క్యూ కట్టారు. జనవరి 8వ తేదీ రాత్రి వరకు మొత్తం 10 రోజుల పాటు వైకుంఠద్వార దర్శన భాగ్యం భక్తులకు లభించనుంది.

స్వర్ణరథోత్సవం, చక్రస్నానం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. బుధవారం ద్వాదశి పర్వదినాన స్వామివారి చక్రస్నానం పుష్కరిణిలో నిర్వహించనున్నారు. మొదటి మూడు రోజులు టైంస్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తెల్లవారుజాము 1 నుంచి ఉదయం 11 గంటల వరకు: కృష్ణతేజ మార్గం, ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు: ఏటీజీహెచ్ మార్గం, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు: శిలాతోరణం మార్గం, జనవరి 2 నుంచి 8 వరకు టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఇప్పటికే జారీ చేసిన ఎస్‌ఈడీ, శ్రీవాణి దర్శన టికెట్లను ఆయా కోటాల మేరకు అమలు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణాన్ని సుమారు 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల పండ్లు, లక్షలాది కట్ ఫ్లవర్స్‌తో అద్భుతంగా అలంకరించారు. ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన శ్రీరంగనాథస్వామి ఆలయ నమూనా, అష్టలక్ష్ముల సెట్టింగ్‌లు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

సీఎం రేవంత్‌రెడ్డి దర్శనం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాత్రే తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చిన సీఎంకు ఆలయ అర్చకులు శాస్త్రోక్త స్వాగతం పలికారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అధికారులు స్వాగతం తెలిపారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. వైకుంఠ ఏకాదశి వేడుకలతో తిరుమల గిరులు, ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విస్తృత భద్రత, దర్శన ఏర్పాట్లు చేపట్టింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మన అంగన్వాడీ మన బాధ్యత

మన అంగన్వాడీ మన బాధ్యత కాక‌తీయ ప్ర‌తినిధి - ఏలూరు : మన...

జాతీయ స్థాయి ఫొటోగ్రఫీలో హ‌రీష్‌కు అవార్డు

జాతీయ స్థాయి ఫొటోగ్రఫీలో హ‌రీష్‌కు అవార్డు ఏపీ ఫొటో జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో...

తిరుప‌తిలో వ్యభిచార గృహంపై దాడి

తిరుప‌తిలో వ్యభిచార గృహంపై దాడి ఆర్గనైజర్‌తో పాటు ముగ్గురు విటుల అరెస్ట్ ఇద్దరు మహిళలను...

వైభవంగా అషాడమాస సారె సమర్పణ

వైభవంగా అషాడమాస సారె సమర్పణ కాక‌తీయ, ఏలూరు ప్ర‌తినిధి : మండల కేంద్రంలోని...

అనాథ శతాధిక వృద్ధురాలికి అంత్యక్రియలు

అనాథ శతాధిక వృద్ధురాలికి అంత్యక్రియలు వృద్ధాశ్రమం, ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ శేఖర్, మధు సేవలను...

దేవుడి సొమ్ముకే ఎసరు

దేవుడి సొమ్ముకే ఎసరు గుడివాడ‌లో ఘరానా మోసం వెలుగులోకి దేవ‌డి కిరీటం బ్యాంకులో తాక‌ట్టు.. రూ.70...

అసాంఘీక కార్యక‌లాపాల‌కు అడ్డ‌కట్ట‌ వేస్తా

అసాంఘీక కార్యక‌లాపాల‌కు అడ్డ‌కట్ట‌ వేస్తా - కోట విలేకర్లతో ఎస్‌.ఐ వల్లి పద్మ కాక‌తీయ...

వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం

వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం గ్రామీణ పేదరిక నిర్మూలనకు టెక్నాలజీ తోడ్పాటు వీఏఓల పనితీరులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.