epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కార్పొరేషన్ ఎన్నికల్లో “కారు” స్పీడ్ పెంచాలి

కార్పొరేషన్ ఎన్నికల్లో “కారు” స్పీడ్ పెంచాలి
కాంగ్రెస్ బాకీ కార్డును ప్రజల వద్దకు చేర్చాలి
పనితనాన్ని బట్టే ప్ర‌జ‌లు ప‌ట్టం కడుతారు
కార్పొరేషన్ ను గెలిపించుకుని కేసీఆర్‌కు కానుక‌గా ఇద్దాం
కార్యకర్తల స‌మావేశంలో భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు
క‌లిసి ప‌నిచేయాల‌ని పిలుపునిచ్చిన ఎంపీ వ‌ద్దిరాజు, మాజీ మంత్రి వనమా

కొత్తగూడెం, కాకతీయ రూరల్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు గడుస్తున్నా ఎన్నికల ముందు ప్రకటించిన 420 హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమై ప్రజలను నయవంచన చేసిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఈ వైఫల్యాలను ‘బాకీ కార్డు’ రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి వార్డులో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఈ బాకీ కార్డును ప్రచారం చేయాలని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలను సవాలుగా తీసుకొని సమయాన్ని వృథా చేయకుండా శక్తి వంచన లేకుండా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.

కార్పొరేషన్ ఎన్నికలే అసలైన పరీక్ష

కార్పొరేషన్‌లో ‘కారు’ స్పీడును పెంచి కార్పొరేషన్‌ను కైవసం చేసుకొని మాజీ ముఖ్యమంత్రి *కె. చంద్రశేఖర్ రావు*కు కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని నేతలు స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు చెందిన సర్పంచులను గెలిపించడంలో కింది స్థాయి క్యాడర్ కష్టపడ్డ తీరు పార్టీపై నమ్మకాన్ని మరింత పెంచిందని అన్నారు. అదే స్ఫూర్తితో కార్పొరేషన్ ఎన్నికల్లో సీనియర్ నాయకులను కలుపుకొని వారి సలహాలు, సూచనలతో వ్యూహాత్మకంగా ముందుకు సాగి బీఆర్ఎస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఫామ్ ఇచ్చే బాధ్యత పూర్తిగా పార్టీదేనని, ఇందులో ఎవరి వ్యక్తిగత ప్రమేయం ఉండదని నేతలు స్పష్టం చేశారు. ‘నీ–నా’ భేదాలు వదిలి ప్రజల్లో మంచి పేరు, పలుకుబడి ఉన్న నాయకుడినే అభ్యర్థిగా ఎంపిక చేస్తామని చెప్పారు. బీఫామ్ పొందే వ్యక్తి పనితనం, ప్రజల్లో ఉన్న గుర్తింపే ప్రామాణికమని తెలిపారు. ఇక నుంచి కార్పొరేషన్‌లో ఫోటోలు పంచాయతీలకు తావు ఉండదని తేల్చిచెప్పారు.

బీఆర్ఎస్‌కు పూర్వ వైభవం ఖాయం

ఇటీవల ఖమ్మంలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభలో ఆయన మాటల తీరును హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. బీఆర్ఎస్ దిమ్మలను తొలగించాలని బహిరంగంగా పిలుపునివ్వడం రౌడీయిజాన్ని ప్రోత్సహించడం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని, బీఆర్ఎస్‌కు పూర్వ వైభవం తిరిగి వస్తుందని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 40 శాతానికి పైగా విజయం లభించిందని, అదే ఉత్సాహంతో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయం సాధించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్పొరేషన్ డివిజన్ల వారీగా బీఆర్ఎస్ ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దాము, సీనియర్ నాయకులు కాంపల్లి కనకేష్, రాజు గౌడ్, మల్లెల రవిచంద్ర, చందు నాయక్, సింధు తపస్వి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్‌ దాడులు

నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్‌ దాడులు 1,900 లీటర్ల చక్కెర పానకం ధ్వంసం 55...

‘నార్మల్ లేదు… బ‌ల‌వంతంగా ప‌వ‌ర్ పెట్రోల్‌..?

'నార్మల్ లేదు... బ‌ల‌వంతంగా ప‌వ‌ర్ పెట్రోల్‌..? పెట్రోల్ బంకుల తీరుపై వాహనదారుల ఆగ్రహం అధిక...

రూ.180 కోట్ల డ్రైనేజీ టెండర్‌లో భారీ గోల్‌మాల్..?

రూ.180 కోట్ల డ్రైనేజీ టెండర్‌లో భారీ గోల్‌మాల్..? సర్ధార్ రవీందర్ సింగ్ భూగర్భ మురుగునీటి...

వ‌రంగ‌ల్ సీపీగా శ్వేత

వ‌రంగ‌ల్ సీపీగా శ్వేత సైబరాబాద్ క‌మిష‌న‌రేట్‌ ట్రాఫిక్ విభాగానికి సన్‌ప్రీత్ సింగ్ బ‌దిలీ...

ధాన్యం కాంట్రాక్టర్ల అసమర్థతకు మేం బ‌లికావాలా..?

ఇసుక లారీలను బలవంతంగా ఆపడం సరికాదు ధాన్యం కాంట్రాక్టర్ల అసమర్థతకు మేం బ‌లికావాలా..? వేధింపులు...

ఖమ్మంలో మంత్రి తుమ్మలకు మచ్చ తెచ్చే పని.. పీవీ కుమార్తె ఫిర్యాదుతో సీరియస్ అయిన అమాత్యుడు!

మంత్రి తుమ్మ‌ల‌కు మ‌చ్చ తెచ్చే ప‌ని 40ఏళ్ల మంత్రి అనుభ‌వాన్ని గుర్తించేలా పైలాన్...

బావిలో పడి తండ్రి–కొడుకు మృతి

బావిలో పడి తండ్రి–కొడుకు మృతి మంత్రి సీతక్క దిగ్బ్రాంతి కాకతీయ, ములుగు ప్రతినిధి :...

హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు

హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సంచలన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.