epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రేవంత్ రెడ్డి ‘డైవర్షన్ పాలిటిక్స్’

రేవంత్ రెడ్డి ‘డైవర్షన్ పాలిటిక్స్’
హామీల అమ‌లులో కాంగ్రెస్ ప్ర‌భుత్వం విఫ‌లం
వైఫల్యాల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు కేసీఆర్‌కు నోటీసులు
మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఫైర్‌
వ‌రంగ‌ల్ చౌర‌స్తాలో బీఆర్ఎస్ నిర‌స‌న‌.. స్తంభించిన‌ ట్రాఫిక్
నన్నపునేని అరెస్టు చేసిన పోలీసులు

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత *కేసీఆర్*పై సిట్ విచారణకు వ్యతిరేకంగా వరంగల్ నగరం ఆదివారం ఉద్రిక్తతకు కేంద్రంగా మారింది. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విచారణకు ఆదేశించిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భారీగా రోడ్లెక్కాయి. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నేతృత్వంలో వరంగల్ చౌరస్తాలో నిర్వహించిన నిరసనతో పరిసర ప్రాంతాలు కాసేపు రణరంగాన్ని తలపించాయి. నిరసన సందర్భంగా నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలనా అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలను అడ్డుపెట్టుకొని కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ అరెస్టులతో ఉక్కుపాదం మోపడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావుల జోలికి వస్తే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

పోలీసుల జోక్యంతో ఉద్రిక్తత

నిరసన ఉధృతం కావడంతో వరంగల్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు నన్నపునేని నరేందర్‌తో పాటు పలువురు ముఖ్య బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను బలవంతంగా అదుపులోకి తీసుకుని వాహనాల్లో ఎక్కించి ఇంతెజార్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నన్నపునేని నరేందర్ అరెస్ట్ వార్త వ్యాపించగానే వరంగల్ నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఇంతెజార్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి, స్థానిక మంత్రి *కొండా సురేఖ*కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.