epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వివాదాస్పద స్థలాలకు ఇంటి అనుమతులు

వివాదాస్పద స్థలాలకు ఇంటి అనుమతులు
కార్య‌ద‌ర్శి తెల‌వ‌కుండా కారోబార్ సంత‌కాలు
పంచాయ‌తీ స్టాంప్ వేసి అనుమ‌తులు జారీ
ఏలుకుర్తి హవేలీ జీపీలో అక్ర‌మాల వ్య‌వ‌హారం
ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య పంచాయితీతో వెలుగులోకి అస‌లు నిజం
త‌న‌కు తెలియకనే జ‌రిగిందంటున్న పంచాయతీ కార్యదర్శి
తనకు సంబంధం లేదంటున్న కారోబార్
కాక‌తీయ‌కు చిక్కిన ఆధారాలు..!

కాకతీయ, గీసుగొండ : వివాదంలో ఉన్న స్థలాలకు గ్రామ పంచాయతీ కార్యదర్శి, కారోబార్ కలిసి ఇంటి అనుమతి ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన ఘటన గీసుగొండ మండలంలో కలకలం రేపుతోంది. ఒకే స్థలానికి వేర్వేరు వ్యక్తులకు అనుమతులు ఇవ్వడం, అనంతరం రిజిస్ట్రేషన్లు జరగడం, చివరికి విషయం కోర్టు మెట్లు ఎక్కడంతో అసలు వ్యవహారం బయటపడింది. గీసుగొండ మండలం ఏలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన అన్నదమ్ముల మధ్య ఇంటి దారి విషయంలో చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీలు నిర్వహించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వివాదంలో ఉన్న స్థలానికి ఒక వ్యక్తికి ధ్రువీకరణ పత్రం జారీ చేయడంతో, అతడు దారితో సహా ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయం తెలిసిన తమ్ముడు కూడా అదే గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని, తన ఇంటి నంబరుతో ఉన్న స్థలానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మరింత వివాదానికి దారితీసింది. ఒకే స్థలానికి రెండు వేర్వేరు అనుమతులు ఎలా జారీ అయ్యాయన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కోర్టు మెట్లు ఎక్కిన వివాదం
ఇంటి ధ్రువీకరణ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అన్నదమ్ములు పరస్పరం కోర్టును ఆశ్రయించి నోటీసులు పంపించుకున్నారు. దీంతో వివాదంలో ఉన్న స్థలానికి అనుమతులు ఎలా మంజూరయ్యాయన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. తన అన్నకు వివాదాస్పద స్థలానికి ధ్రువీకరణ పత్రం ఎలా ఇచ్చారని తమ్ముడు గ్రామ పంచాయతీ కార్యదర్శికి నోటీసులు పంపినట్లు సమాచారం. ఈ వ్యవహారం గ్రామస్థాయిలోనే కాకుండా మండల వ్యాప్తంగా చర్చకు దారితీసింది. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారా, లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే అంశాలపై విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తెలియక ఇచ్చానంటున్న కార్యదర్శి
ఈ వ్యవహారంపై ఎలుకుర్తి హవేలీ పంచాయతీ కార్యదర్శి కోడెపాక నరేష్ స్పందిస్తూ, ఇంటి ధ్రువీకరణ పత్రం కోసం గ్రామస్తుడు తన వద్దకు వచ్చాడని తెలిపారు. కారోబార్ శంకర్‌ను అడిగితే అన్ని వివరాలు సవ్యంగానే ఉన్నాయని చెప్పడంతోనే ధ్రువీకరణ పత్రం జారీ చేశానని వివరణ ఇచ్చారు. వివాదంలో ఉందని తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు. ఇదే వివాదంలో మరో వ్యక్తికి తన సంతకాలను ఫోర్జరీ చేసి, దొంగ స్టాంపులతో తప్పుడు ధ్రువీకరణ పత్రం జారీ చేశారని ఆరోపించారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు కార్యదర్శి తెలిపారు.

తనకు సంబంధం లేదంటున్న కారోబార్
వివాదంలో ఉన్న స్థలానికి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎలుకుర్తి హవేలీ కారోబార్ ఓ.శంకర్ స్పష్టం చేశారు. ఆ పత్రాలు పూర్తిగా గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్ మంజూరు చేసినవేనని, ఈ వ్యవహారంలో తన జోక్యం ఏమీ లేదని ఆయన తెలిపారు. ఒకే స్థలానికి రెండు వేర్వేరు అనుమతులు జారీ కావడం, రిజిస్ట్రేషన్లు జరగడం వెనుక అసలు కారణాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి రజక సంఘం ఏటూరునాగారం మండ‌ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.