epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జంపన్నవాగు పనుల్లో గుట్టు రట్టు కావాల్సిందే!

జంపన్నవాగు పనుల్లో గుట్టు రట్టు కావాల్సిందే!
ప్రతి జాతరకు ఒకే కాంట్రాక్టర్‌కు కోట్ల టెండర్లు
పాత సామగ్రితో కొత్త పనులంటూ గోల్‌మాల్‌..!
విరాళంగా వచ్చిన మోటార్ల వినియోగంపై అనుమానాలు
సమగ్ర విచారణ జరపాలని భక్తుల డిమాండ్

కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరుగాంచిన శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా జంపన్నవాగు పరిసరాల్లో జరిగే అభివృద్ధి పనులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి జాతరలో కోట్ల రూపాయల విలువైన టెండర్ పనులు ఒకే కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడం వెనుక అధికారులతో కుమ్మక్కు వ్యవహారం ఉందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే అనుమానాలు భక్తులు, స్థానికుల్లో రోజురోజుకు పెరుగుతున్నాయి. జంపన్నవాగులో ఇసుక లెవెలింగ్, స్నాన ఘట్టాలకు నీటి సరఫరా, బట్టలు మార్చుకునే గదుల నిర్మాణం, తాత్కాలిక వసతుల ఏర్పాటు వంటి ప్రధాన పనులన్నీ ప్రతిసారి ఒకే కాంట్రాక్టర్‌కే అప్పగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. టెండర్ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని, ముందుగానే కాంట్రాక్టర్‌ను ఖరారు చేసి తూతూమంత్రంగా టెండర్లు నిర్వహిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

2022లో ఏర్పాటు చేసిన బ‌ట్ట‌లు మార్చుకునే రేకుల షెడ్డును.. 2026 లో ఏర్పాటు చేసిన‌ట్లుగా లెక్క‌ల్లో చూపిన కాంట్రాక్ట‌ర్‌..

ప్రతి సారి అదే తంతు

ఒకసారి కొనుగోలు చేసిన పరికరాలను జాతర ముగిసిన తర్వాత భద్రపరిచి, తదుపరి జాతరలో మళ్లీ వాటినే వినియోగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రతి జాతరకు టెండర్ అంచనా మాత్రం కోట్లలో పెరుగుతుండటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాత సామగ్రికి కేవలం రంగులు వేసి కొత్త పనులుగా చూపిస్తూ ప్రభుత్వ సొమ్ము కాజేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ప్రతిసారి కోట్ల రూపాయల వ్యయంతో కొత్త పనులు చేసినట్టు బిల్లులు చూపించడం వెనుక పెద్ద స్థాయి అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర కాంట్రాక్టర్లకు అవకాశం ఇవ్వకుండా ఒకే వ్యక్తికి పనులు కట్టబెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోందని స్థానికులు అంటున్నారు.

విరాళ మోటార్లపై వివాదం

గత జాతర సందర్భంగా సిఆర్ఐ మోటార్స్ సంస్థ భక్తుల సౌకర్యార్థం జంపన్నవాగులో వినియోగం కోసం మోటార్లను విరాళంగా అందజేసింది. ఆ మోటార్లు అధికారుల ఆధీనంలో ఉండాల్సి ఉండగా, అవి కాంట్రాక్టర్ వద్దే ఉండి మళ్లీ కాంట్రాక్ట్ పనుల్లో వాటినే ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విరాళంగా వచ్చిన సామగ్రిని కాంట్రాక్టర్ తన స్వంత ఆస్తిలా వాడుకోవడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అధికారులకు–కాంట్రాక్టర్‌కు మధ్య ఉన్న అనుబంధానికి ఇదే నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి జాతర సమయంలో కొద్ది రోజుల పనికి కోట్ల రూపాయల బిల్లులు ఎలా చెల్లిస్తున్నారన్న దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మహా జాతర 31వ తేదీతో ముగిసిన అనంతరం కాంట్రాక్టర్ ఏర్పాటు చేసిన పరికరాలను తొలగించి మళ్లీ భద్రపరచే పనులు ప్రారంభించాడని తెలుస్తోంది. తదుపరి జాతరలోనూ ఇదే సామగ్రిని మళ్లీ ఉపయోగించే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. అయినా కొత్త టెండర్ల పేరుతో భారీ మొత్తాలు చెల్లించడం వెనుక అసలు రహస్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

అధికారులకు ‘పర్సంటేజీ’ ఆరోపణలు

జాతర పనుల కేటాయింపుల్లో అధికారులకు పర్సంటేజీల రూపంలో లావాదేవీలు జరుగుతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు అధికారులకు ప్రత్యేక విందులు, వినోదాల ఏర్పాట్లు చేయడం, ప్రశ్నించిన వారికి డబ్బులు పంపిణీ చేయడం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మీడియా ప్రతినిధులకూ ‘కవర్లు’ అందజేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జంపన్నవాగు పరిసరాల్లో జరిగే టెండర్ ప్రక్రియలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిధులు పారదర్శకంగా ఖర్చు అవుతున్నాయా లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని, అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. జాతర పవిత్రతకు భంగం కలిగించే ఇలాంటి వ్యవహారాలను వెంటనే అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.