epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం

భారీ జరిమానాను సవాలు చేస్తూ ద‌ళ‌ప‌తి రిట్ పిటిషన్

జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పిన ధ‌ర్మాస‌నం

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: ప్రముఖ సినీ నటుడు, ‘తమిళగ వెట్రి కజగం’ పార్టీ అధినేత దళపతి విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్నుశాఖ తనకు విధించిన రూ.1.50 కోట్ల భారీ జరిమానాను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. ఐటీశాఖ జారీచేసిన పెనాల్టీ ఉత్తర్వులు చట్టబద్ధంగానే ఉన్నాయని, నిర్ణీత గడువులోపే ఆ నోటీసులు జారీ అయ్యాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. దీంతో విజయ్ ఇప్పుడు ఆ జరిమానా చెల్లించడం లేదా పై కోర్టులకు వెళ్లడం అనివార్యమైంది.

అసలేం జరిగింది?

ఈ కేసు మూలాలు 2015 నాటివి. 2015 సెప్టెంబర్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విజయ్ నివాసంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో విజయ్ నటించిన ‘పులి’ సినిమాకు సంబంధించి కొన్ని కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సినిమా ద్వారా విజయ్ సుమారు రూ.15 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందారని, కానీ ఆ మొత్తాన్ని తన ఆదాయపు పన్ను రిటర్నుల్లో చూపించలేదని ఐటీ శాఖ ఆరోపించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ ఆదాయాన్ని దాచిపెట్టారన్నది ప్రధాన అభియోగం.

రూ.1.50 కోట్ల పెనాల్టీ

సోదాల్లో లభించిన ఆధారాల మేరకు ఐటీ శాఖ చర్యలకు ఉపక్రమించింది. లెక్కల్లో చూపని ఆ రూ.15 కోట్ల ఆదాయానికి సంబంధించి, 2022 జూన్ 30న ఒక ఉత్తర్వు జారీ చేసింది. దీని ప్రకారం విజయ్ రూ.1.50 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ విజయ్ 2022లోనే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి బెంచ్, 2022 ఆగస్టు 16న పెనాల్టీ చెల్లింపుపై మధ్యంతర స్టే విధించింది.

వాదనలు ఏంటి?

విజయ్, ఐటీ శాఖ తరఫున హోరాహోరీ వాదనలు జరిగాయి. “ఐటీ శాఖ జారీ చేసిన పెనాల్టీ ఆర్డర్ కాలం చెల్లింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 275 ప్రకారం, 2019 జూన్ 30 లోపే ఈ ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ మూడేళ్లు ఆలస్యంగా ఇచ్చారు కాబట్టి దీన్ని రద్దు చేయాలి” అని విజయ్ తరఫున వాదనలు వినిపించారు. చట్టంలోని సెక్షన్ 263 ప్రకారం, షోకాజ్ నోటీసు జారీ చేయడం, పెనాల్టీ విధించడం అన్నీ నిబంధనల ప్రకారమే, నిర్ణీత గడువులోపే జరిగాయి. ఇందులో ఎలాంటి ఉల్లంఘన లేదు” అని ఐటీ శాఖ వాదనలు వినిపించింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.