epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రమాణం చేసిన వెంటనే పనిలోకి

ప్రమాణం చేసిన వెంటనే పనిలోకి
చెత్తపై యుద్ధం.. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం
సొంత ఖర్చులతో డ్రైనేజీల శుభ్రపరిచిన ప్రజా ప్రతినిధులు
34, 36 వార్డుల్లో కౌన్సిలర్ల సేవలకు ప్రజల ప్రశంసలు
వాట్సాప్ గ్రూపులతో సమస్యల పరిష్కారానికి కొత్త పంథా

కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన నూతన వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే పనిలోకి దూకారు. తమ తమ వార్డుల్లో పారిశుద్ధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ చెత్త తొలగింపు, డ్రైనేజీల శుభ్రపరిచే కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో చురుకుగా వ్యవహరిస్తూ ప్రజా ప్రతినిధులుగా తమ బాధ్యతను నిరూపించుకుంటున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 36 వార్డులు ఉండగా, ముఖ్యంగా 34వ వార్డు కౌన్సిలర్ గుండా రాజశేఖర్, 36వ వార్డు కౌన్సిలర్ ముత్యం వెంకన్న పారిశుద్ధ్య పనుల్లో ముందుండి సేవలందిస్తున్నారు. గత మూడు రోజులుగా ఆయా వార్డుల్లో పేరుకుపోయిన చెత్త, డ్రైనేజీల్లో నిల్వ ఉన్న మురుగును సొంత ఖర్చులతో తొలగించి ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.

వెంటనే స్పందన.. ప్రజల్లో విశ్వాసం

వార్డుల్లో ఎక్కడ సమస్య వచ్చిన వెంటనే స్పందిస్తూ పరిష్కారం చూపుతున్నారు. వీధిలైట్లు, డ్రైనేజీలు, రహదారులపై ఉన్న చెత్త తొలగింపు వంటి అంశాల్లో స్వయంగా పర్యవేక్షణ చేపడుతున్నారు. ప్రజల సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని కోరుతూ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారు. గతంలో రెండు సార్లు గెలిచి మూడోసారి కూడా ప్రజల విశ్వాసం పొందిన గుండా రాజశేఖర్ అనుభవంతో సేవలందిస్తుండగా, తొలిసారి ఎన్నికైన ముత్యం వెంకన్న కూడా అదే స్థాయిలో చురుకుగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ప్రజల సమస్యలను త్వరగా తెలుసుకోవడానికి కౌన్సిలర్లు తమ తమ వార్డులకు ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఈ గ్రూపుల ద్వారా ప్రజలు తెలియజేసే సమస్యలను వెంటనే గుర్తించి, సంబంధిత ప్రాంతాలకు వెళ్లి పరిష్కరిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజుల్లోనే ప్రజలకు సేవలు అందించడం ప్రారంభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా అన్ని వార్డు కౌన్సిలర్లు పనిచేస్తే మహబూబాబాద్ మున్సిపాలిటీ స్వచ్ఛ పట్టణంగా మారడం ఖాయమని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.