epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పారిచోద్యం..!

పారిచోద్యం..!
వరంగల్ నగరంలో పేరుకుపోతున్న చెత్త‌
నామమాత్రంగా చెత్త సేకరణ…
అస్తవ్యస్తంగా పారిశుధ్యం
వీధుల్లో గుట్ట‌లుగా చెత్త చెదారం
మురికికాల్వలు మూసుకుపోయి దుర్వాసన
పర్యవేక్షణలో బల్దియా విఫలం

కాకతీయ, వరంగల్ : స్వచ్ఛతపై ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నామని చెబుతున్నా, వరంగల్ నగరంలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పలు ప్రధాన రహదారులు, గల్లీలు చెత్తాచెదారంతో నిండిపోయి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పారిశుధ్య సిబ్బంది తూతూమంత్రంగా విధులు నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్నామనే కారణంతో వీధుల శుభ్రతను నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. ప్రధాన రహదారుల వెంట కూడా చెత్త గుట్టలు కనిపిస్తున్నాయి. చిన్నచిన్న గల్లీల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

మురికికాల్వలు తీసే వారే కరువా?

నగరంలోని అనేక ప్రాంతాల్లో మురికికాల్వలు పూర్తిగా మూసుకుపోయాయి. ప్లాస్టిక్ కవర్లు, పానీయాల సీసాలు, కూరగాయల చెత్తతో కాల్వలు నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. వరంగల్ లక్ష్మీపురం మార్కెట్ సమీపంలో చెత్త తొలగింపు పట్ల పూర్తిస్థాయి నిర్లక్ష్యం కనిపిస్తోంది. చెత్త కుండీలు నిండిపోవడంతో కుక్కలు చెత్తను తోడుతూ రోడ్లపై చెల్లాచెదురుగా పడేస్తున్నాయి. పిన్నవారి వీధి, డాల్ఫిన్ గల్లి ప్రవేశ రహదారి, గిర్మాజిపేట, ఆటోనగర్, దేశాయిపేట ప్రాంతాల్లో కూడా ఇదే దుస్థితి నెలకొంది. వర్షం పడితే ఈ చెత్త మురికినీటిగా మారి కాలనీల్లోకి చేరే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పర్యవేక్షణ శూన్యం

పారిశుధ్య పనులపై బల్దియా అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే పరిస్థితి ఇంత అధ్వానంగా మారడానికి కారణమని విమర్శలు వస్తున్నాయి. మురికికాల్వల శుభ్రతపై సిబ్బంది నిర్లక్ష్యాన్ని పట్టించుకోవడం లేదని స్పష్టమవుతోంది. శానిటేషన్ విభాగం నామమాత్రంగా చెత్త సేకరణ చేపట్టి బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని స్థానికులు అంటున్నారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న ఈ పరిస్థితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దాలంటే కేవలం ప్రకటనలు కాకుండా కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. అధికారులు స్పందించి పారిశుధ్య వ్యవస్థను గాడిలో పెట్టాలని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.