epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రభుత్వ పథకాలు

ప్రభుత్వ పథకాలు
అర్హులందరికీ చేరాలి

సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం

కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి

దిశ సమావేశంలో అభివృద్ధి పనుల పురోగతిపై చర్చ

కాకతీయ, వరంగల్ బ్యూరో: హనుమకొండ కలెక్టరేట్‌లో శనివారం జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హనుమకొండ జిల్లా కాంగ్రెస్ (డీసీసీ) అధ్యక్షులు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇనగాల మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పురోగతిని పర్యవేక్షించేందుకు దిశ కమిటీ ఎంతో కీలకమని తెలిపారు. 2016 జూలైలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ, అప్పటి వరకు ఉన్న డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ స్థానంలో ఏర్పాటైందని వివరించారు.

కేంద్ర పథకాల అమలుపై సమీక్ష

గత త్రైమాసికంలో తీసుకున్న నిర్ణయాలపై పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. జిల్లాలో అమలు అవుతున్న 43కుపైగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పరిస్థితిపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్, ఆయుష్మాన్ భారత్, పీఎం ఉజ్వల యోజన, అమృత్, స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు, పీఎం ముద్రా యోజన వంటి కీలక పథకాల అమలుపై అధికారులు నివేదికలు సమర్పించారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం పెరిగితే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. పథకాల అమలులో అవినీతికి తావులేకుండా మినిమమ్ గవర్నమెంట్, మాక్సిమమ్ గవర్నెన్స్ సూత్రంతో పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షణను బలోపేతం చేయాలని కోరారు.

ప్రజా సమస్యలపై చర్చ..

జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. ఉపాధి హామీ పనుల వేగవంతం, పేదలకు గృహ నిర్మాణ పథకాల అమలు, శుభ్రత కార్యక్రమాల విస్తరణ, ఆరోగ్య సేవల మెరుగుదల వంటి అంశాలపై చర్చించారు. రేషన్, పెన్షన్లు, విద్య, వైద్య సేవలు ప్రజలకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీ కడియం కావ్యతో కలిసి జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే హనుమకొండ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దవచ్చని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజల కోసం కేటాయించిన ప్రతి రూపాయి సరైన విధంగా వినియోగించబడాలని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు ప్రభుత్వ పథకాల పూర్తి ప్రయోజనం అందించడమే దిశ కమిటీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సమావేశంలో తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కె.ఆర్. నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, హనుమకొండ మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.