epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం

బీఆర్ఎస్ హయాంలోనే సాగునీటి విప్లవం
ఎల్లంపల్లి, మిడ్ మానేర్, వరద కాలువ పనులు మా కృషే
రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు
బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. శనివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల సమీపంలోని వరద కాలువను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం వరద కాలువలో ప్రవహిస్తున్న నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతల చేసినవేనని పేర్కొన్నారు. ఇటీవల లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లు నడిపి కాలువలోకి నీటిని వదిలినప్పటికీ కాళేశ్వరం లేదని సీఎం చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని అన్నారు. వరద కాలువ ఆధారంగా చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, బాల్కొండ తదితర నియోజకవర్గాల్లో పంటలు సాగుతున్నాయని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సాగునీటి కేంద్రంగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్ హయాంలో పూర్తికాని ఎల్లంపల్లి ప్రాజెక్టును రూ.2052 కోట్ల వ్యయంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. అలాగే మిడ్ మానేర్ ప్రాజెక్టును రూ.1526 కోట్లకు పైగా ఖర్చు చేసి పూర్తి చేసి కాళేశ్వరం జలాలతో నింపినట్లు తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ పునరుజ్జీవన పథకం కింద సుమారు రూ.2000 కోట్లతో వరద కాలువను పునరుద్ధరించి ఏడాది పొడవునా నీరు ఉండేలా చేశామని చెప్పారు. వరద కాలువను రిజర్వాయర్‌లా అభివృద్ధి చేసి రెండు వైపులా తూములు ఏర్పాటు చేయడంతో వేలాది ఎకరాల్లో పంటలు సాగుతున్నాయని పేర్కొన్నారు.

ప్రాజెక్టులు పూర్తి చేసిన బీఆర్ఎస్, విమర్శలతోనే కాంగ్రెస్

సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు మల్కపేట రిజర్వాయర్, మెట్పల్లి ప్రాంతానికి నీరు అందించే సదర్మాట్ ప్రాజెక్టు, హుస్నాబాద్ ప్రాంతానికి సాగునీరు అందించే గౌరవెల్లి ప్రాజెక్టు వంటి పలు సాగునీటి ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని హరీశ్ రావు తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టులో 96 శాతం పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసినప్పటికీ మిగిలిన పనులను కూడా ప్రస్తుత ప్రభుత్వం పూర్తిచేయలేకపోతోందని విమర్శించారు. గత రెండున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం ఒక్క కొత్త సాగునీటి ప్రాజెక్టును కూడా ప్రారంభించలేదని, ఇప్పటికే 70–80 శాతం పూర్తైన పనులను కూడా ముందుకు తీసుకెళ్లలేకపోతోందని ఆరోపించారు. మేడిగడ్డ వద్ద కొన్ని పిల్లర్లు దెబ్బతిన్నాయని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని ప్రచారం చేయడం సరైంది కాదని హరీశ్ రావు అన్నారు. అవసరమైన మరమ్మతులు చేపడితే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పనిచేస్తుందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం విమర్శలకే పరిమితం కాకుండా సాగునీటి పనులను ముందుకు తీసుకెళ్లాలని హ‌రీష్‌రావు డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.