epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హోటళ్లకు గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్‌

హోటళ్లకు గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్‌
కమర్షియల్ సిలిండర్లపై కంపెనీల నియంత్రణ
ఆస్పత్రులు, హాస్టళ్లకు మాత్రమే ప్రాధాన్యత
గృహ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు
త‌క్ష‌ణం అమ‌లు చేయాల‌ని కంపెనీల ఆదేశాలు
ఈకేవైసీ తప్పనిసరి చేసిన గ్యాస్ కంపెనీలు
సిలిండర్ బుకింగ్ వ్యవధిని 25 రోజులకు పెంపు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : దేశంలో గ్యాస్ సరఫరాపై పెట్రోలియం కంపెనీలు కొత్త నియంత్రణలు అమలు చేస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పరిమితం చేస్తూ హోటళ్లకు సరఫరా నిలిపివేయాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న గ్యాస్ నిల్వలను అత్యవసర అవసరాలకే వినియోగించాలని కంపెనీలు నిర్ణయించాయి. పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్యాస్ నిల్వలను జాగ్రత్తగా వినియోగించేందుకు కొత్త మార్గదర్శకాలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్లను ఆస్పత్రులు, హాస్టళ్లకు మాత్రమే సరఫరా చేయాలని డీలర్లకు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లకు తాత్కాలికంగా సరఫరా నిలిపివేయాలని సూచించినట్లు సమాచారం.

గృహ వినియోగదారులకు ప్రాధాన్యం

ఈ నిర్ణయం వల్ల గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. గ్యాస్ వినియోగం సక్రమంగా ఉండేందుకు కొన్ని నియంత్రణలు కూడా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత మరో సిలిండర్ బుక్ చేసుకునే వ్యవధిని పెంచారు. గతంలో 21 రోజులు ఉండగా ఇప్పుడు 25 రోజులకు పెంచినట్లు అధికారులు తెలిపారు. గ్యాస్ వినియోగదారులు తమ ఆధార్ వివరాలతో ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి చేశారు. ఈకేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ బుకింగ్ సదుపాయాన్ని నిలిపివేయనున్నట్లు హెచ్చరించారు. అక్రమంగా గ్యాస్ నిల్వలు చేయకుండా నిరోధించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. వినియోగదారులు వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని గ్యాస్ కంపెనీలు సూచిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.