epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అనుమతి లేకుండా అడుగుపెట్టొద్దు

అనుమతి లేకుండా అడుగుపెట్టొద్దు
ట్రాన్స్‌కోలో సీఈ తీరుపై విమర్శలు
వరంగల్ జోన్‌లో చీఫ్ ఇంజనీర్‌పై కార్మికుల ఆగ్ర‌హం
నేరుగా సమస్యలు చెప్పొద్దంటూ ఆదేశాలు జారీపై ఆవేద‌న‌
మానసిక ఒత్తిడికి గురవుతున్నామంటున్న ఉద్యోగులు
తెలంగాణలోనూ “పెత్తనం” కొనసాగుతోందని విమర్శలు
పరిస్థితి మారకపోతే ఉద్యమానికి సిద్ధమంటూ హెచ్చరిక

కాకతీయ, వరంగల్: ట్రాన్స్‌కో వరంగల్ జోన్‌లో కొత్తగా జారీ చేసిన క్రమశిక్షణ మార్గదర్శకాలు ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నాయి. చీఫ్ ఇంజనీర్ తీరుపై విద్యుత్ కార్మికులు, ఇంజనీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకునే అవకాశమే లేకుండా ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
వరంగల్ జోన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల ప్రకారం… చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి నేరుగా రావొద్దని, కేవలం కంట్రోలింగ్ అధికారుల ద్వారా మాత్రమే తమ సమస్యలను తెలియజేయాలని మెమో రూపంలో ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల సమస్యలు పై స్థాయికి చేరే మార్గం దాదాపు మూసుకుపోయిందని కార్మికులు పేర్కొంటున్నారు. ఇకపై అనుమతి లేకుండా చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి వస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం మరింత ఆందోళనకు గురిచేస్తోందని చెబుతున్నారు. తమ మాట వినకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు.

సమస్యలు చెప్పుకోవడమే నేరమా?

ఫీల్డ్‌లో పని చేసే ఉద్యోగులకు రోజువారీగా ఎదురయ్యే సమస్యలు చాలా ఉంటాయని, వాటిని ఉన్నతాధికారులకు నేరుగా చెప్పడం సహజమని కార్మికులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా చేయడం వల్ల తమ బాధలు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కంట్రోలింగ్ అధికారుల ద్వారా మాత్రమే విషయాలు చెప్పాలని నిబంధన పెట్టడం వల్ల అనేక సమస్యలు అక్కడే ఆగిపోతున్నాయని, పై స్థాయికి చేరడం లేదని వారు అంటున్నారు.
ట్రాన్స్‌కో అధికారులు మాత్రం ఈ నిర్ణయం క్రమశిక్షణ కోసం తీసుకున్నదని చెబుతున్నా… ఉద్యోగులు మాత్రం ఇది క్రమశిక్షణ పేరుతో ఒత్తిడి పెంచే చర్యగా అభివర్ణిస్తున్నారు. చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి తరచుగా వెళ్లడం వల్ల పనితీరుకు అంతరాయం కలుగుతోందని అధికారులు చెబుతుండగా, ఫీల్డ్ సిబ్బంది మాత్రం తమ సమస్యలు పరిష్కారం కావడానికే ఆఫీస్‌కు వెళ్లాల్సి వస్తోందని అంటున్నారు. అనుమతి లేకుండా వెళ్లినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పడం వల్ల ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఇది పని సామర్థ్యంపై కూడా ప్రభావం చూపుతోందని వారు చెబుతున్నారు.

“పెత్తనం” కొన‌సాగుతోంద‌ని ఆరోపణలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు కొనసాగడం బాధాకరమని విద్యుత్ కార్మికులు విమర్శిస్తున్నారు. స్థానిక ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా, అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రత్యేకంగా “బయటి రాష్ట్ర అధికారుల పెత్తనం” కొనసాగుతోందని కార్మిక సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవడం బాధ కలిగిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అలాగే కొనసాగితే పెద్ద స్థాయిలో ఆందోళనకు దిగాల్సి వస్తుందని విద్యుత్ కార్మికులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతామని స్పష్టం చేస్తున్నారు. ట్రాన్స్‌కోలో ఫీల్డ్ సిబ్బంది స్వేచ్ఛగా తమ సమస్యలు చెప్పుకునే పరిస్థితి కల్పించాలని, కొత్త ఆంక్షలను పునఃసమీక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. “అనుమతి లేక అడుగు లేదు” అన్న కొత్త విధానం… క్రమశిక్షణ కంటే వివాదాలకు దారి తీసినట్టుగా కనిపిస్తోంది. అధికారులు తీసుకున్న నిర్ణయం ఒకవైపు డిసిప్లిన్ కోసం అయితే, మరోవైపు ఉద్యోగుల్లో అసంతృప్తి పెంచుతోంది. ఇక ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో… యాజమాన్యం వెనక్కి తగ్గుతుందా? లేక కార్మికులు ఆందోళనకు దిగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.