epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

న‌ర్సంపేట‌లో ఎయిర్టెల్ విధ్వంసం

న‌ర్సంపేట‌లో ఎయిర్టెల్ విధ్వంసం
అనుమతి లేకుండానే కేబుల్ త‌వ్వ‌కాలు
నీటి సరఫరా వ్య‌వ‌స్థ‌కు తీవ్ర అంత‌రాయం
నిబంధనలు ఉల్లంఘించిన ఎయిర్టెల్‌పై చర్యలు
మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్

కాకతీయ,నర్సంపేట టౌన్‌ : అనుమతులు లేకుండా రోడ్లపై తవ్వకాలు చేయడం వల్ల నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో వరంగల్ మెయిన్ రోడ్, ద్వారకపేట మెయిన్ రోడ్‌లపై ఎయిర్టెల్ నెట్వర్క్ సంస్థ రాత్రికి రాత్రే భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టింది. ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. పలుచోట్ల వాటర్ పైప్‌లైన్లు పగిలిపోయాయి. పట్టణంలో నీటి సరఫరా అంతరాయం ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ అనుమతి లేకుండా తవ్వకాలు చేయడం నిబంధనల ఉల్లంఘన అని స్పష్టం చేశారు. వెంటనే దెబ్బతిన్న పైప్‌లైన్లను మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశించారు. నీటి సరఫరాను త్వరగా పునరుద్ధరించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన ఎయిర్టెల్ నెట్వర్క్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో యంత్రాలతో తవ్వకాలు చేయవద్దని హెచ్చరించారు. అవసరమైతే మానవ వనరులతో పనులు చేయాలని సూచించారు. రేపటిలోగా పైప్‌లైన్ మరమ్మతులు పూర్తి చేస్తామని తెలిపారు. నీటి సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు బీరం భరత్ రెడ్డి, హనుమకొండ శ్రీధర్, బాణాల ప్రసన్న శ్రీనివాస్, పొన్నాల మనీషా ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాట ప్రభాకర్, కీసర వెంకటేశ్వర్లు, యూత్ నాయకులు మెరుగు కిరణ్, ఉప్పుల శాలూమ్, దేవోజ్ హేమంత్, చీకటి శివమణి, టౌన్ వాటర్ లైన్ ఇంచార్జ్ కాట శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.